spot_img
Homeక్రీడలుక్రికెట్‌Ishan Kishan Comeback Story: ఫిదా చేశావురా బుడ్డోడా.. కమ్ బ్యాక్ అంటే ఇదీ..

Ishan Kishan Comeback Story: ఫిదా చేశావురా బుడ్డోడా.. కమ్ బ్యాక్ అంటే ఇదీ..

Ishan Kishan Comeback Story: ఇషాన్ కిషన్ ‘కమ్ బ్యాక్’ స్టోరీ వింటుంటే.. మన ఊరి బస్టాండ్లో మిస్సైన బస్సు.. నేరుగా ఎయిర్‌పోర్ట్‌లో విమానమై ల్యాండ్ అయినట్టు ఉంది. బీసీసీఐ నుంచి “గెట్ అవుట్” అనిపించుకున్న స్టేజ్ నుండి.. ఏకంగా వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోవడం.. దంచికొట్టడం.. కీలక ఓపెనర్, వన్ డౌన్ గా స్థిరపడడం.. వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించడం.. ఇప్పుడు ఏకంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు “బాస్” అయ్యే వరకు ఈ ‘పాకెట్ డైనమైట్’ ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి.

Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?

ఇషాన్ కిషన్ 2.0: సెంట్రల్ కాంట్రాక్ట్ పోయినా.. కెప్టెన్సీ కొట్టేయొచ్చు గురూ!

ఒకప్పుడు ఈ కుర్రాడు దుబాయ్ బీచుల్లో ఎంజాయ్ చేస్తుంటే.. “వీడికి కెరీర్ మీద సీరియస్‌నెస్ లేదు.. ఇక ఇంటికే” అని నెటిజన్లు సోషల్ మీడియాలో తీర్పులు ఇచ్చేశారు. బీసీసీఐ పెద్దలైతే ఏకంగా ‘సెంట్రల్ కాంట్రాక్ట్’ నుంచి పేరు తీసేసి “ముందు డొమెస్టిక్ ఆడి రా.. అప్పుడు చూద్దాం” అని గేటు బయట నిలబెట్టారు. కానీ అప్పుడు మొదలైంది అసలు సినిమా!

అప్పట్లో ‘పార్టీ’.. ఇప్పుడు ‘ఛాంపియన్’ అరాచకం!

క్రమశిక్షణ అంటే మనదేమరీ.. టీమ్ మీటింగ్‌ల కంటే హార్దిక్ పాండ్యాతో జిమ్ సెషన్లు ముఖ్యం అనుకున్న ఇషాన్.. గంభీర్ కోచింగ్‌లోకి వచ్చాక ‘సైలెంట్ మోడ్’లోకి వెళ్ళిపోయాడు. వివాదాలకు దూరంగా, బౌలర్లకు దగ్గరగా ఉంటూ బాదడమే పనిగా పెట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన టీమ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టి, “నా దగ్గర బ్యాటింగ్ మాత్రమే కాదు.. బ్రెయిన్ కూడా ఉంది” అని నిరూపించాడు. అది చూసే కాబోలు, కావ్య పాప ( సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని) ఏరికోరి మరీ ఈ ‘కెప్టెన్సీ’ కిరీటాన్ని ఇషాన్ తల మీద పెట్టింది.

కమిన్స్ గైర్హాజరీ.. కిషన్ పంట పండింది!

పాట్ కమిన్స్ గాయపడటం SRH ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ కావొచ్చు కానీ, ఇషాన్‌కు మాత్రం అది ‘బంపర్ ఆఫర్’. “అభిషేక్ శర్మ ఉన్నాడుగా.. అతనే కెప్టెన్ అవుతాడు” అని అంతా అనుకున్నారు. కానీ పాపం అభిషేక్ తన బ్యాటింగ్‌తో తానే కుస్తీ పడుతుంటే, ఇషాన్ మాత్రం గాల్లోకి బంతుల్ని లేపుతూ కెప్టెన్సీ రేసులో అందరినీ దాటేశాడు.

వరల్డ్ కప్ హీరో.. ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీకి బరోసా!

9 మ్యాచుల్లో 317 పరుగులు.. అది కూడా 231 స్ట్రైక్ రేట్‌తో అంటే బౌలర్లు బౌలింగ్ వేయాలా లేక బంతిని పట్టుకోవడానికి బౌండరీ దగ్గర వెయిట్ చేయాలా అని కన్ఫ్యూజ్ అయ్యేలా చేశాడు. కజిన్ చనిపోయిన బాధలోనూ దేశం కోసం హాఫ్ సెంచరీ బాదిన ఆ గుండె.. ఇప్పుడు SRH కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోదా ఏంటి? “జీవితంలో ఒక్కోసారి వెనక్కి తగ్గడం అంటే ఓడిపోవడం కాదు.. భారీ జంప్ చేయడానికి రెడీ అవ్వడం” అని ఇషాన్ నిరూపించాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ పోయినప్పుడు నవ్విన నోళ్లే.. ఇప్పుడు ఇషాన్ కొట్టే సిక్సర్లకు నోరెళ్లబెడుతున్నాయి.

ఫిదా చేశావురా బుడ్డోడా.. ఇక ఐపీఎల్‌లో నీ ‘హైదరాబాదీ దమ్ బిర్యానీ’ ఆట కోసం వెయిటింగ్!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version