Ashutosh Sharma
Ashutosh Sharma : ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 18వ ఎడిషన్ ను విజయవంతంగా మొదలుపెట్టింది. ఎదుర్కొన్న తొలి మ్యాచ్ లో ఉత్కంఠ పరిస్థితుల మధ్య విజయం సాధించింది. తొలి మ్యాచ్లో లక్నోను కోడించింది. ఢిల్లీ గెలవడంలో అశుతోష్ శర్మ ముఖ్యపాత్ర పోషించాడు. ఢిల్లీ జట్టు గెలుపులో అతడికే ఎక్కువ భాగం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18వ ఎడిషన్ హోరాహోరీగా సాగుతోంది. రోజురోజుకు అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. అందిజట్లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోరాడుతున్నాయి. జరిగింది నాలుగు మ్యాచ్ లే అయినప్పటికీ హోరాహోరీగా సాగాయి.. ఇక సోమవారం జరిగిన లక్నో – ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అభిమానులు సిటీ ఎడ్జ్ లో కూర్చున్నారు. గెలుపు రెండు జట్ల మధ్య చివరి వరకు దోబూచులాడింది. అయితే ఢిల్లీ జట్టు ఆటగాడు అశుతోష్ శర్మ (31 బంతుల్లో 66*) ఢిల్లీ జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. బౌండరీలు కొట్టి.. సిక్సర్లు బాది విశాఖ తీరంలో సునామీ సృష్టించాడు. అయితే అలాంటి నిప్పు కణిక లాంటి ఆటగాడు ఇప్పుడు బంగారం లాంటి అవకాశాన్ని పొందినట్టు తెలుస్తోంది.
Also Read : వాహ్.. ఏం అడావు భయ్యా.. ఈ ఒక్కడు ఢిల్లీ సైన్యమై గెలిపించాడు..
సూర్య కుమార్ యాదవ్ ఏం చెప్పాడంటే..
అద్భుతమైన బ్యాటింగ్ తో ఢిల్లీ జట్టుకు అశుతోష్ వర్మ అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో అతనికి టీమిండియాలో చోటు ఖాయమైందని తెలుస్తోంది. అతడు ఆడే ఆట.. కొనసాగించే దూకుడు.. చూపించే నేర్పరితనం.. భయం లేకుండా ఆడే తీరును చూసి బీసీసీఐ పెద్దలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారట. అయితే t20 జాతీయ జట్టులోకి అతడికి చోటు లభించడం ఖాయమట. గత ఐపిఎల్ సీజన్లో పంజాబ్ జట్టు తరఫున శర్మ ఆడాడు. అప్పుడు కూడా విధ్వంసానికి పరాకాష్ట లాగా ఆడాడు. అయితే ఇప్పుడు కూడా అతడు అదే ఊపు కొనసాగిస్తున్న నేపథ్యంలో టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అతని ఆట తీర్పు ఇంప్రెస్ అయ్యాడట. ” పట్టుదల.. ఏదైనా సాధించగల సామర్థ్యం.. పోరాట శక్తి ఉండడం అద్భుతమని” ఇన్ స్టా గ్రామ్ లో సూర్య కుమార్ యాదవ్ పోస్ట్ పెట్టాడు. శర్మను అభినందించాడు.అశుతోష్ శర్మ ఇలాగే ఆడితే టీ 20 జాతీయ జట్టులో అశుతోష్ శర్మకు స్థానం గ్యారంటీ అని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐతే గతంలో సూర్య కుమార్ యాదవ్ కూడా టి20 క్రికెట్ ఇదే విధంగా ఆడేవాడు. తుఫాన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకునేవాడు. తద్వారా అతడు తన ఆట తీరుతో టీమిండియాలో చోటు సంపాదించాడు. ఇప్పుడు టి20 క్రికెట్ జట్టుకు నాయకుడిగా కొనసాగుతున్నాడు.
Also Read : చెన్నై బౌలర్ బాల్ ట్యాంపరింగ్..MI పై అందుకే గెలిచిందా?
Suryakumar Yadav’s Instagram story for Ashutosh Sharma. ❤️ pic.twitter.com/b4zGTdb5s7
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025