Rohit Sharma's wife fires at Chahal's ex-wife
Yuzendra Chahal Wife : పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంట ప్రముఖ క్రికెటర్ చాహల్(Yuzendra Chahal), ధనశ్రీ వర్మ(Dhanasree Varma) లది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2020 వ సంవత్సరం లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. చాహల్ క్రికెట్ ఆడే ప్రతీ స్టేడియం కి తనతో పాటు వచ్చి హల్చల్ చేసేది ధనశ్రీ. ఇక ఇన్ స్టాగ్రామ్ లో వీళ్లిద్దరు కలిసి ఎన్నో ఫోటోలు, రీల్స్ చేసారు. అవి ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యేవి, మిలియన్ల కొద్దీ లైక్స్, కామెంట్స్ వచ్చేవి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, ఒక రోజు వీళ్లిద్దరు ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. తమ ప్రొఫైల్స్ లో వీళ్ళు కలిసున్న ఫోటోలను వీడియోలను మొత్తం తొలగించేసారు. అంతే కాకుండా ధనశ్రీ తన ప్రొఫైల్ పేరు నుండి ‘చాహల్’ పేరు ని తొలగించింది.
Also Read : అప్పటినుంచి ఎడం పెరిగిందట.. అందువల్లే విడాకులట..
దీంతో అందరూ వీళ్లిద్దరు విడిపోయారని పసిగట్టేసారు. నేషనల్ లెవెల్ లో వీళ్ళు విడిపోయినట్టు వార్తలు బాగా ప్రచారం అయ్యాయి. మొదట్లో ఇది కేవలం రూమర్ అని అంతా అనుకున్నారు కానీ, అది రూమర్ కాదు నిజమేనాని బాంద్రా లోని ఫ్యామిలీ కోర్టు లో వీళ్లిద్దరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు అర్థమైంది. రీసెంట్ గానే విచారణ చేపట్టిన కోర్టు, వీళ్ళిద్దరికి విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చాహల్ ధనశ్రీ కి 4 కోట్ల 25 లక్షల రూపాయిలు భరణం ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఈ అంశంపై సోషల్ మీడియా లో చాహల్ కి సపోర్ట్ గా ధనశ్రీ ని ట్రోల్ చేస్తూ అనేక పోస్టులు పడ్డాయి. శుభంకర్ మిశ్రా అనే ప్రముఖ పాత్రికేయుడు, ధనశ్రీ కేవలం డబ్బుల కోసమే చాహల్ ని పెళ్లి చేసుకుంది అంటూ ఒక పోస్టు పెట్టాడు.
దీనికి ఇండియన్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సతీమణి రితికా శర్మ(Ritika Sajdeh) లైక్ కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. అంటే ధనశ్రీ డబ్బు కోసమే చాహల్ ని పెళ్లాడింది అనే విషయాన్ని రితికా కూడా నమ్ముతున్నట్టు ఈ లైక్ ద్వారా అర్థం అవుతుంది. ఇదంతా పక్కన పెడితే మొన్న జరిగిన ఒక మ్యాచ్ లో చాహల్ ఒక అమ్మాయితో కనిపించాడు. అంతే కాకుండా ఆయన ఆరోజు ధరించిన టీ, దాని మీద రాసి ఉన్న ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే పదాలు బాగా వైరల్ అయ్యాయి. దాని అర్థం నీ సొంత డబ్బుల మీద మాత్రమే ఆధారపడి, అవతలోల్ల డబ్బుల మీద కాదు అని అన్నట్టు. పరోక్షంగా ఆయన ధనశ్రీ భరణం తీసుకోవడాన్ని విమర్శిస్తూ ఈ టీ షర్ట్ వేసుకున్నాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : యజువేంద్ర చాహల్ – ధనశ్రీ.. ఇక అధికారికం