Allu Arjun , Trivikram
Allu Arjun-Trivikram : మన ఇండియన్ మూవీ లవర్స్ ఇప్పటి వరకు రామాయణం, మహాభారతం మీద ఎన్నో సినిమాలు చూసారు. మన పురాణ ఇతిహాసాలపై ప్రతీ ఒక్కరికి ఒక అవగాహన అయితే గట్టిగానే ఉంది. కానీ మన పురాణాల్లో జనాలకు తెలియని కొన్ని ముఖ్యమైన గాధలు చరిత్రలో కనుమరుగు అయ్యాయి. వాటి మీద ఇప్పటి వరకు ఎవ్వరూ సినిమాలు తీయడం కానీ, స్టోరీలు రాయడం కానీ జరగలేదు. మన గ్రంధాలను పరిశీలిస్తే ఇలాంటివి బయటపడుతాయి.అలా మన టాలీవుడ్ లో గ్రంధాలపై, పురాణాలపై అద్భుతమైన అవగాహన ఉన్న దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మాత్రమే. పురాణాలపై ఇతనికి ఉన్నంత జ్ఞానం దేశంలో ఏ దర్శకుడుకి కూడా లేదు. ఆయన పురాణాల గురించి మాట్లాడడం మొదలు పెడితే రోజు మొత్తం వింటూనే కూర్చుంటాం, అలాంటి జ్ఞాని ఆయన. తనకు ఎంతో పట్టు ఉన్నటువంటి ఇలాంటి సబ్జెక్టు పై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్క సినిమా కూడా చేయలేదు.
Also Read : రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న సమంత..? ఆధారాలతో సహా దొరికేసిందిగా!
ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ సబ్జెక్టు పై సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. త్వరలోనే ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శివపార్వతుల కుమారుడు కార్తికేయ స్వామి కి సంబంధించినది అట. కార్తికేయ స్వామి గురించి మనకు తెలిసిన అంశాలు చాలా తక్కువ. ఆయనని అందరూ ‘గాడ్ ఆఫ్ వార్’ అని పిలుస్తుంటారు. యుద్ధ రంగంలో కార్తికేయ స్వామి అడుగుపెడితే, అతన్ని ఓడించే శక్తి మూడు లోకాల్లోనూ ఎవరూ లేరు అనేది వాస్తవమైన నిజం. ఈ అంశంపై ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. సీరియల్స్ లో కూడా ఈ అంశంపై మనం ఒక్క ఎపిసోడ్ కూడా చూసి ఉండము. కొన్ని సంఘటనల కారణంగా కార్తికేయ స్వామి తన తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఆయనకు ఎదురైనా సంఘటనలను ఆధారంగా తీసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడట.
ఈ సినిమాని ప్రకటించిన రోజు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మన టాలీవుడ్ వైపు చూస్తుందట. అంతటి భారీగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. సుమారుగా 600 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఖర్చు చేయబోతున్నారట. మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదట, ఆ విషయంలో మాత్రం అభిమానులకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. ముందుగా అట్లీ తో చేయబోయే సినిమా షూటింగ్ ని మొదలు పెడుతాడట అల్లు అర్జున్. మే, లేదా జూన్ నెలలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
Also Read : లేడీ విలన్ గా రెజీనా ఫుల్ బిజీ..రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందంటే!