https://oktelugu.com/

Viral Video : మ్యాచ్ లో మాత్రమే ప్రత్యర్థులు.. ఆ తర్వాత స్నేహితులు.. వీడియో వైరల్

Viral Video : క్రీడల్లో పోటీ ఉండాలి. కాకపోతే అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఆ పోటీ కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగాలి. అంటే తప్ప ప్లేయర్లకు వేరే లక్ష్యాలు ఉండకూడదు.

Written By: , Updated On : March 25, 2025 / 09:14 PM IST
Rishabh Pant with Kuldeep Yadav and Axar Patel

Rishabh Pant with Kuldeep Yadav and Axar Patel

Follow us on

Viral Video : ప్రస్తుతం ఐపీఎల్ 18వ ఎడిషన్ నడుస్తోంది. ఇప్పటికే ఈ నాలుగు మ్యాచ్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇవన్నీ కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నాయి. వచ్చే మ్యాచ్లు మరింతగా ఆదరణ సొంతం చేసుకుంటాయని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ వ్యాఖ్యానిస్తున్నారు.. సాయంత్రం కాగానే ప్రేక్షకులు టీవీలు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు.. మ్యాచ్లు జరిగే ప్రాంతాల్లో అభిమానులు మైదానాలకు క్యూ కడుతున్నారు. మొత్తంగా ఐపీఎల్ ఫీవర్ వల్ల ప్రజలు క్రికెట్ ను అమితంగా ఇష్టపడుతున్నారు. ఆటగాళ్లు పోటా పోటీగా ఆడటం వల్ల ప్రేక్షకులకు క్రికెట్ అంటే విపరీతంగా ఇష్టపడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ ల సమయంలో మైదానంలో ఆటగాళ్లు పోటాపోటీగా తలపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో కట్టు తప్పుతారు. ఆ సమయంలో మాటలు తూలుతుంటారు. అంతే కాదు తమ చేష్టలతో మైదానంలో వాతావరణాన్ని హీట్ ఎక్కిస్తుంటారు. అయితే కొంతమంది ఆటగాళ్లు మాత్రం పోటీ ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యర్థుల లాగా ఉంటారు. ఆ తర్వాత ఆ వాతావరణం మర్చిపోయి.. సరదాగా గడిపిస్తుంటారు.. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

Also Read : మళ్లీ మొదలెట్టావా ‘గొయెంకా’.. ఇలాగైతే లక్నో టీం బాగుపడదు సామీ

స్నేహితులు సందడి చేశారు

సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్(LSG vs DC) పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో లక్నో జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 200 కు మించి పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని చేదించడంలో ఢిల్లీ జట్టు చివరి వరకు పోరాడింది. చివరికి విజయం సాధించి అదరగొట్టింది.. ఢిల్లీ సాధించిన విజయంలో అశుతోష్ శర్మ కీలకపాత్ర పోషించాడు. ఒత్తిడిలో లక్నో బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ.. మైదానంలో పరుగుల వరద పారించాడు. ఢిల్లీ జట్టు సాధించిన విజయంలో ముఖ్యపాత్ర పోషించిన అశుతోష్ వర్మ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కొన్ని తప్పులు చేశాడు. అవి ఢిల్లీ జట్టుకు ఉపకరించాయి. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్, కీలక ఆటగాడు కులదీప్ యాదవ్.. లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మైదానంలో సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. మ్యాచ్ గెలిచిన ఆనందంలో అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ సరదాగా మాట్లాడుకుంటుండగా.. మధ్యలోకి రిషబ్ పంత్ వచ్చాడు. వారు ముగ్గురు సరదాగా కబుర్లు చెబుతూ.. “మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆటగాళ్ల మధ్య పోటీ ఉంటుంది.. మ్యాచ్ జరిగిన తర్వాత స్నేహం అలాగే కొనసాగుతుందని ఈ ముగ్గురు ఆటగాళ్లు నిరూపించారు. వీరు ఇలాగే తమ స్నేహాన్ని కొనసాగించాలి. క్రికెట్లో సరికొత్త సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టాలి. వచ్చే తరం ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాలి. క్రికెట్ అంటే పోటీ మాత్రమే కాదు క్రీడా స్ఫూర్తి అని” నెటిజన్లు పేర్కొంటున్నారు.

Also Read : 29 ఏళ్లకే 600 సిక్సర్లు.. యూనివర్సల్ బాస్ రికార్డ్ బద్దలే..