cricket : క్రికెటర్లు (అందరూ కాదు) మైదానంలో అడుగుపెట్టే ముందు శృంగారంలో పాల్గొంటారా? క్రికెట్లో శృంగారం అనేది సర్వసాధారణమా? క్రికెటర్లు ఆటకు ముందు అలాంటి పనుల్లో పాల్గొనకుండా కట్టడి చేసే సీన్ ఉండదా? అంటే ఈ ప్రశ్నలకు కొన్నింటికి అవును అని, మరికొన్నింటికీ కాదని సమాధానాలు చెబుతున్నాడు కోల్ కతా బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్. కోల్ కతా జట్టు ఐపిఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత.. అభిషేక్ ఫేమస్ యూట్యూబ్ రణ్ వీర్ అల్ల హబడియా కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను రణ్ వీర్ తో పంచుకున్నాడు. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో అతడు ఏం చెప్పాడంటే..
” క్రికెటర్లు మ్యాచ్ మధ్యలో శృంగారంలో పాల్గొనడం సర్వసాధారణమని” అభిషేక్ పేర్కొన్నాడు. దీంతో అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోల్ కతా జట్టు ఐపిఎల్ మూడవ టైటిల్ సాధించడంలో అభిషేక్ కీలకపాత్ర పోషించాడు. యూట్యూబ్ పొడ్ కాస్ట్ లో రణ్ వీర్ ” క్రికెట్లో శృంగారం” అనే ప్రశ్న అడిగారు.. దానికి అభిషేక్ నవ్వుతూ…” నువ్వు సానుకూల దృక్పథం తోనే ఆ ప్రశ్న అడిగావా” అంటూ చమత్కరించాడు…” ప్రతి ఆటగాడి మెదడులో ఎదురీత, ప్రతి దాడి, సంఘర్షణ అనేవి తిరుగుతూనే ఉంటాయి.. అందుకే కొందరు ఆటగాళ్లు సంభోగంలో పాల్గొంటారు. కాస్త ఆ భక్తుడి నుంచి దూరమవుతారు. మరికొందరు శృంగారాన్ని అస్సలు పట్టించుకోరు.. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు లేదా మధ్యలో శృంగారంలో పాల్గొనడం అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరు సంభోగంలో మునిగి తేలాల్సిన అవసరం లేదని.. అలాంటి నియమం ఏ జట్టూ పెట్టదని” అభిషేక్ పేర్కొన్నాడు.
అభిషేక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 2009లో టీమిండియా తరఫున తొలి వన్డే ఆడాడు. అటు బౌలింగ్, బ్యాటింగ్లో సత్తా చాటుతాడు అనుకుంటే.. తొలి ఏడాదిలోనే జట్టుకు అనుకోకుండా దూరమయ్యాడు. అదే ఏడది సెప్టెంబర్లో చివరి మ్యాచ్ ఆడాడు. అనంతరం పొట్టి క్రికెట్ పై అభిషేక్ కృషి సారించాడు. 2018లో కోల్ కతా జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అప్పటినుంచి కోల్ కతా యాజమాన్యం వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. అభిషేక్ సలహాలతో చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్ ఆటలో మరింత పదును తేలారు. అభిషేక్ అలా ఆరు సంవత్సరాల పాటు కష్టపడటంతో.. ఈ సీజన్లో కోల్ కతా ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకుంది.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ఒడిసి పట్టింది..కోల్ కతా జట్టు కంటే ముందు చెన్నై, ముంబై జట్లు చెరో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు దక్కించుకున్నాయి.