Homeక్రీడలుBest cricket team in Asia: శ్రీలంక కాదు, పాకిస్తానూ కాదు.. టీమిండియా తర్వాత ఆసియాలో...

Best cricket team in Asia: శ్రీలంక కాదు, పాకిస్తానూ కాదు.. టీమిండియా తర్వాత ఆసియాలో అత్యుత్తమ జట్టు ఇదే..

Best cricket team in Asia: క్రికెట్లో ఆస్ట్రేలియా డామినేషన్ కొనసాగుతున్న సమయంలో బలమైన పోటీదారుగా నిలిచింది టీం ఇండియా. ఆస్ట్రేలియా కు ప్రత్యామ్నాయం తానే అన్నట్టుగా వ్యవహరించింది. ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా స్థానానికి చెక్ పెట్టింది. టి20 లలో ఇప్పటికే ఆస్ట్రేలియాను టీమిండియా అధిగమించింది. వన్డే, టెస్టులలో కూడా సత్తా చూపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరి కొద్ది రోజుల్లో అయితే ఈ ఫార్మేట్ లో కూడా టీమిండియా ఆస్ట్రేలియాను అధిగమించగలుగుతుంది.

ఐసీసీ నిర్వహించిన మేజర్ టోర్నీలలో ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఎక్కువ ట్రోఫీలను అందుకుంది. ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో టీమిండియా ఉంది. ఒకరకంగా ఆసియాలో క్రికెట్ ఆడుతున్న జట్లలో టీమిండియా నెంబర్ వన్. గతంలో శ్రీలంక.. పాకిస్తాన్ సమర్థవంతమైన క్రికెట్ ఆడేవి. కొంతకాలంగా ఆ జట్లు అంత గొప్పగా ఆట తీరు ప్రదర్శించలేకపోతున్న నేపథ్యంలో భారత జట్టు తర్వాత ఆ స్థాయిలో ఆడే జట్టు ఏది ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమయ్యేది. అయితే ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించింది.

ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు టీమ్ ఇండియా తర్వాత ఆ స్థాయిలో ఉత్తమమైన ఆట తీరు ప్రదర్శిస్తోందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. 2023 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సెమి ఫైనల్ దాకా వెళ్ళింది. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత టి20 వరల్డ్ కప్ లో కూడా సమర్థవంతమైన ప్రదర్శన చేసింది. ఇప్పుడు ఇండియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో దాదాపు దక్షిణాఫ్రికా జట్టును ఓడించినంత పని చేసింది. తద్వారా క్రికెట్లో తాము అండర్ డాగ్ కాదని.. రైజింగ్ స్టార్స్ తో కూడిన జట్టు అని నిరూపించింది ఆఫ్గానిస్తాన్.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు పోరాట పటిమను చూపించడంలో ఆరితేరిపోయిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. సొంత దేశంలో సరైన స్థాయిలో సదుపాయాలు లేకపోయినప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ.. ఆఫ్గనిస్తాన్ క్రీడాకారులు క్రికెట్ మీద విపరీతమైన ప్రేమను పెంచుకున్నారు. అందువల్లే వారు ఈ స్థాయిలో ఆడగలుగుతున్నారు. ఇక ఐపీఎల్లో ఆఫ్గనిస్తాన్ ప్లేయర్లకు భారీగా డిమాండ్ ఉంటున్నది. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కు టీమిండియాలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. అతడు ఆడుతుంటే మైదానంలో గోల చేస్తారు. సోషల్ మీడియాలో అతడిని లక్షల మంది అనుసరిస్తున్నారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper
Exit mobile version