https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్… ఆ ఘటనతో మరోసారి రచ్చ!

ఇలాంటి నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయనే కామెంట్ సెక్షన్ క్లోజ్ చేస్తున్నా. కానీ ఇలా నా మీద మీమ్స్ వేసి కామెడీ చేస్తున్నారంటూ రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 8, 2024 / 08:40 PM IST

    Renu Desai fires on Pawan Kalyan fans

    Follow us on

    Pawan Kalyan : రేణుదేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్స్ పై తరచుగా నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. ఆమె తీరు నచ్చని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, టార్గెట్ చేసి ట్రోల్ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, వదిన అంటే ఆమెకు అసలు నచ్చదు.ట్రోల్స్ పై విసిగిపోయిన రేణు దేశాయ్ చాలా వరకు పోస్టులకు కామెంట్ సెక్షన్ బంద్ చేసి పెడుతున్నారు.

    కాగా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తనయుడు అకీరాను ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ రేణు దేశాయ్ వరుస పోస్టులు చేశారు. అకీరాను చూసి తన మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుందని .. ప్రధాని మోదీ ని కలవడం చాలా గర్వంగా ఉందని మురిసిపోయారు.

    ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. రేణు దేశాయ్ ఎడిట్ చేసి పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవాలను ఫోటో నుండి తీసేశారు. కేవలం మోదీ, అకీరా ఉన్న ఫోటో షేర్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. ఎంతైనా విమెన్ ఈర్ష్యతో ఇలా చేసింది. మాజీ భార్య కదా ప్రజెంట్ భార్య ని ఫోటోలో లేకుండా చేసిందని మీమ్స్ చేశారు. వీటికి స్పందించిన రేణుదేశాయ్ అసహనం వ్యక్తం చేశారు.

    భార్య, మాజీ భార్య అంటూ అంటూ నా మీద మీమ్స్ వేసుకుంటున్నారు. నా బాధ వాళ్ళకి నవ్వులాటగా ఉంది అంటూ ఆవేదన చెందారు. నాకు జరిగినట్లు వాళ్లకి జరిగితే ఆ బాధ అర్థం అవుతుంది. ఇలాంటి నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయనే కామెంట్ సెక్షన్ క్లోజ్ చేస్తున్నా. కానీ ఇలా నా మీద మీమ్స్ వేసి కామెడీ చేస్తున్నారంటూ రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు.