https://oktelugu.com/

Jio Hotstar : క్రికెట్ అభిమానులకు పండగ లాంటి న్యూస్ చెప్పిన జియో.. ఏకంగా అన్ని రోజులపాటు ఉచితంగా..

ఇప్పుడు నడుస్తున్నవన్ని స్మార్ట్ రోజులు.. థియేటర్ కు వెళ్లకుండా ఓటీటీలో సినిమాలు చూస్తున్న రోజులు.. క్రికెట్ మ్యాచ్ ను టీవీలకు అతుక్కుపోకుండా జస్ట్ స్మార్ట్ ఫోన్లో చూస్తున్న రోజులు.. అందుకే కంపెనీలు కూడా స్మార్ట్ ఆఫర్లను తీసుకొస్తున్నాయి.. క్రికెట్ అభిమానులకు మరింతైన ఆనందాన్ని అందిస్తున్నాయి.

Written By: , Updated On : February 24, 2025 / 06:39 PM IST
Jio Hotstar Subscription

Jio Hotstar Subscription

Follow us on

Jio Hotstar : ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో ఇది ముగుస్తుంది. ఆ తర్వాత అసలు సిసలైన క్రికెట్ ఆనందం మొదలవుతుంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ మార్చ నుంచి షురూ అవుతుంది. సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా క్రికెట్ ఆనందం ఆనందం అవుతుంది . దేశంలో క్రికెట్ కి కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. పైగా ఐపీఎల్ అనేది క్రికెట్లో రిచ్ క్రికెట్ లీగ్ గా రూపాంతరం చెందింది. పాకిస్తాన్ మినహా మిగతా ఆటగాళ్లు మొత్తం ఐపీఎల్లో ఆడుతున్నారు. ఇప్పటికే 17 ఎడిషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. 18వ ఎడిషన్ కూడా విజయవంతం అయ్యేందుకు ఐపిఎల్ నిర్వాహక కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించింది. గత రెండు సీజన్ల నుంచి ఐపీఎల్ ను జియో సినిమా లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఆ హక్కులను జియో సినిమానే పొందింది.

జియో సినిమా , డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒకే గొడుగు కిందికి రావడంతో జియో హాట్ స్టార్ ఏర్పడింది. జియో హాట్ స్టార్ లోనే ఐపిఎల్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం జియో సరికొత్త ప్యాక్ అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ టోర్నమెంట్ను దృష్టిలో పెట్టుకొని డేటాతో పాటు సబ్ స్క్రిప్షన్ ఉండే ప్యాక్ అందుబాటులోకి తెచ్చింది. 195 రూపాయల చెల్లిస్తే 15 జీబీ డాటా తో పాటు 90 రోజులపాటు జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందే అవకాశాన్ని కల్పించింది. అయితే ప్యాక్ ధర 200 రూపాయల లోపం ఉండడంతో కస్టమర్లు ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని జియో హాట్ గా భావిస్తోంది. ఓటీటీ మార్కెట్లో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ గ్లోబల్ లీడర్లుగా కొనసాగుతున్నాయి. ఆ రెండింటికి చెక్ పెట్టాలని జియో, హాట్ స్టార్ జట్టుకట్టాయి. జియో హాట్ స్టార్ గా ఏర్పడ్డాయి. అయితే తన మార్కెట్ ను మరింత బలోపేతం చేసుకునేందుకు జియో ద్వారా ఈ రెండు సంస్థలు సరికొత్త ప్యాక్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇక ప్రస్తుతం అభిమానులు క్రికెట్ ను స్మార్ట్ ఫోన్లో ఎక్కువగా చూస్తున్న నేపథ్యంలో..వ్యూస్ ను పెంచుకొని యాడ్ రెవెన్యూ ను మరింత బలోపేతం చేసుకోవాలని జియో హాట్ స్టార్ భావిస్తోంది. ఆదివారం పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన మ్యాచును దాదాపు 50 కోట్ల మంది వీక్షించారు. సుమారు 8 గంటలపాటు జరిగిన మ్యాచ్ లో జియో హాట్ స్టార్ కోట్ల రూపాయలను యాడ్స్ రూపంలో వెనకేసుకుంది. అదే సూత్రాన్ని ఐపీఎల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది . ఇందులో భాగంగానే ఈ ప్యాక్ ను అందుబాటులోకి తెచ్చింది.