Homeఆంధ్రప్రదేశ్‌YSRCP demand Pawan Kalyan CM: సీఎం అంటున్న వైసీపీ.. అలా వద్దంటున్న పవన్!

YSRCP demand Pawan Kalyan CM: సీఎం అంటున్న వైసీపీ.. అలా వద్దంటున్న పవన్!

YSRCP demand Pawan Kalyan CM: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఆశలను ఎప్పటికప్పుడు చిదిమేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి విచ్ఛిన్నం కావాలని కోరుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అలాగే కూటమికి మద్దతు తెలుపుతున్న వర్గాల్లో చీలిక తేవాలని భావిస్తోంది. కూటమి పట్ల వ్యతిరేకత పెంచాలని చూస్తోంది. మూడు పార్టీల మధ్య సమన్వయం చెడగొట్టాలని ఆలోచన చేస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇవన్నీ ఆ పార్టీకి కావాలి. మరి అదే సమయంలో పట్టు నిలుపుకునేందుకు కూటమి ప్రయత్నించాలిగా. ఇప్పుడు అదే మాట చెబుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పార్టీ శ్రేణులకు. మరో 15 సంవత్సరాల పాటు కూటమి ఉండాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కూటమికి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక తేల్చుకోవాల్సింది మూడు పార్టీల శ్రేణులే.

ఆలోచింపజేసిన జనసేనాని..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ప్రత్యేక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan). అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన ప్రకటన ఆలోచింపజేస్తోంది. ఎందుకంటే కూటమి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పెట్టుబడులు, శాంతిభద్రతలు, గ్రామాల్లో మౌలిక వసతులు వంటివి పెద్ద ఎత్తున కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు పవన్. వాటిపై ప్రచారం చేసుకోవడంలో కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారన్నది పవన్ కళ్యాణ్ వాదన. అలా చేయాల్సిన అవసరం పై నిన్ననే అసెంబ్లీలో వ్యాఖ్యానాలు చేశారు పవన్ కళ్యాణ్. అంతటితో ఆగకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు.. కానీ 1100 మంది చెప్పినట్టు వారి వాదనలు ఉంటాయని.. అందుకు ధీటుగా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు తయారు కావాలని సూచించారు పవన్ కళ్యాణ్.

Also Read: రూ.300 కోట్లు.. అమరావతి.. మరో గేమ్ ఛేంజర్

ఏకాభిప్రాయం పై కీలక సూచన..
వేరువేరు సిద్ధాంతాలతో పాటు విధానాలతో ఉన్న మూడు పార్టీలు కలిసి సూపర్ విక్టరీ సాధించాయి. అదే విషయాన్ని ఉదహరించారు పవన్ కళ్యాణ్. కూటమి గెలిచిన వరకు ఏకాభిప్రాయంతో ఉన్నవారు.. మరో 15 ఏళ్ల పాటు కొనసాగేందుకు మరింత సదాభిప్రాయంతో ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న లోపాలు ఉండడం సహజమే కానీ.. విధాన పరమైన అంశాల ద్వారా కలిసి నడవడంతో సుదీర్ఘకాలం కూటమి కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్. ఇలా ఎలా చూసుకున్నా కూటమికి అంతా సర్దుబాటు కావాల్సిందేనని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిపోతారు. లోకేష్ సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తోనే ఉండిపోతారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. అలా జరిగితే ఊరుకునేది లేదని.. పవన్ కళ్యాణ్ సీఎం కావాల్సిందేనని వైసీపీ కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి మాటల నడుమ కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలని పవన్ కోరుకోవడం మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామమే. మేము ఒకటి తలిస్తే పవన్ కళ్యాణ్ మరోలా తలుస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించే దాకా పరిస్థితి వచ్చింది. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ వైసీపీ గాలిని ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు అన్నమాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version