AP Assembly
AP Assembly: ఈరోజు ఏపీ శాసనసభలో( AP assembly) ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం అయింది. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. కొందరు రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం తమ పదవులను వదులుకున్నారు. కూటమి పార్టీలో చేరారు. ఇటువంటి తరుణంలో ధైర్యం పోగుచేసుకొని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు.
* ప్రతిదీ ఆసక్తికరమే
అయితే జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)గత సమావేశాలకు హాజరు కాలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో తమ వాయిస్ నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. అయితే అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో జాప్యం జరుగుతుండడంతో జగన్ శాసనసభకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారని అంతా ప్రచారం జరిగింది. దీంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత దక్కింది.
* ఆ ఒక్క ఎమ్మెల్యే తప్ప
అయితే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సభ్యులంతా పార్టీ కండువాలతో సభలోకి వచ్చారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కండువాలు వేసుకుని కనిపించారు. అయితే ఓ ఎమ్మెల్యే మాత్రం కండువా లేకుండా కనిపించడం అక్కడ హాట్ టాపిక్ అయింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన పార్టీ పార్టీ రాజశేఖర్ పార్టీ కండువా వేసుకోలేదు. దీంతో అందరూ ఆయన వైపు ఆసక్తిగా చూశారు. ఈ ఎన్నికల్లో ఎర్రగొండపాలెం టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు జగన్. కూటమి ప్రభంజనంలో సైతం రాజశేఖర్ గెలిచారు.
* జగన్ అసహనం
అయితే రాజశేఖర్( MLA Rajasekhar ) కండువా వేసి రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గమనించి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమావేశాలను బహిష్కరించిన అనంతరం పార్టీ రాజశేఖర్ను పిలిచి మందలించినట్లు ప్రచారం నడుస్తోంది. కండువా ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే తాను మరిచిపోయానని ఆయన బదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరిచిపోయారా? కండువా మార్చేస్తారా? అని అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించేసరికి రాజశేఖర్ నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది.