Homeక్రీడలుక్రికెట్‌England Vs New Zealand: బౌలింగ్ వేయడం కూడా రాదా..ఇంగ్లాండ్ పరువు మాత్రమే కాదు.. అది...

England Vs New Zealand: బౌలింగ్ వేయడం కూడా రాదా..ఇంగ్లాండ్ పరువు మాత్రమే కాదు.. అది కూడా కోల్పోయింది..

England Vs New Zealand: క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ దేశంలో.. క్రికెట్ లో ఇంగ్లాండ్ ఎన్నో రికార్డులను నెలకొల్పింది.. అటువంటి ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు వరుసగా పరువు తీసుకుంటున్నది. సొంత గడ్డమీద కూడా సరిగా ఆడలేక చేతులెత్తేస్తున్నది. అంతేకాదు ఐసీసీ గర్వ భంగానికి గురవుతున్నది. వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టు ఇలా ఆడటం పట్ల అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. క్రికెట్ పుట్టిన దేశంలో ఏంటి ఈ కర్మ అంటూ వాపోతున్నారు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డలో న్యూజిలాండ్ పర్యటిస్తోంది. మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలిచింది. రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్ట్ లో గొప్పగా ఆడినప్పటికీ.. రెండవ టెస్టులో చేతులెత్తేసింది. ఫలితంగా పర్యాటక న్యూజిలాండ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. వాస్తవానికి ఈ ఓటమి కంటే కూడా ఇంగ్లాండ్ జట్టుకు దారుణమైన ఫలితం మరొకటి ఎదురైంది. అది ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు నుంచి కాదు.. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నుంచి.

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు దారుణంగా బౌలింగ్ వేసింది. ఫలితంగా 253 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. వాస్తవానికి ఈ ఓటమి ఇంగ్లాండ్ జట్టుకు పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినప్పటికీ.. ఐసీసీ తీసుకున్న నిర్ణయం ఇంగ్లాండ్ జట్టుకు మరణ శాసనం రాసింది.. ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు నిదానంగా బౌలింగ్ వేశారు. 12 ఓవర్లను ఆలస్యంగా వేయడంతో ఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు 12 పాయింట్లను కోత విధించింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఖాతాలో 50 నుంచి పాయింట్ల సంఖ్య 38 కి పడిపోయింది. అంతేకాదు ఇంగ్లాండ్ సారథిగా వ్యవహరించిన రూట్ కు జరిమాన కూడా పడింది. మ్యాచ్ ఫీజులో 50 శాతాన్ని ఐసీసీ క్రమశిక్షణ కమిటీ కోసివేసింది.

ఇప్పటికే ఇంగ్లాండు జట్టుకు పాయింట్లు తగ్గిపోయాయి. డబ్ల్యూటీసి జాబితాలో ఇంగ్లాండ్ ఏకంగా ఏడవ స్థానంలో కొనసాగుతోంది. పర్సంటేజ్ తగ్గిందని ఆటగాళ్లు ఇబ్బంది పడుతుంటే.. పాయింట్లు పరంగా కూడా కోత విధించడంతో ఇంగ్లాండ్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇదంతా జరిగిందని.. ఇకపై నైనా ఇంగ్లాండ్ ఆటగాళ్లు మెరుగైన ఆట తీరు కొనసాగిస్తారని.. ఆ జట్టు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండు టెస్టులకు దూరమైన స్టోక్స్.. మూడో టెస్టుకు జట్టులోకి అందుబాటులోకి వచ్చాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular