Eng Vs Ind 3rd Test: లార్డ్స్ టెస్ట్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఐదో రోజు బ్యాటింగ్ దిగిన టీమిండియా వెంట వెంటనే మూడు వికెట్లను కోల్పోయింది. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ వికెట్లను స్వల్ప పరుగుల వ్యవధిలో కోల్పోయింది. స్టోక్స్, ఆర్చర్ అదరగొట్టారు.. ఆర్చర్ రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ వికెట్లను సొంతం చేసుకున్నాడు. స్టోక్స్ కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టాడు. దీంతో ఇండియా కష్టాల్లో పడింది. గెలుస్తుందనుకునే దశ నుంచి.. ఓటమి తప్పదు అనే సంశయం లోకి వెళ్ళింది. పిచ్ నుంచి సహకారం లభిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా పేస్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులు వేస్తూ ఇండియన్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. కార్స్ ఐదో రోజు వికెట్ తీయకపోయినప్పటికీ.. పదునైన బంతులు వేసి భారత బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
Also Read: ఏపీకి అవార్డుల పంట.. హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు!
టీమిండియా స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ బౌలర్లు తమ నోటికి పని చెప్పారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ మైదానంలో ఓవర్ ఆక్షన్ చేశాడు. బంతి వేసిన ప్రతిసారి నోటికి పని చెప్పాడు. అంతేకాదు పిచ్చిగంతులు వేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా స్టోక్స్ వేసిన ఓ బంతి బౌన్సర్ లాగా దూసుకు వచ్చింది. అది నితీష్ కుమార్ రెడ్డి హెల్మెట్ కు తగిలింది. దీంతో నితీష్ కిందపడ్డాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ నితీష్ వద్దకు వచ్చాడు. “బంతి వేగం సరిపోతుందా? ఎత్తులో బాగా వచ్చిందా? అటువంటి బంతిని నువ్వు ఆడగలవా? ఆడే ధైర్యం ఉంటే ఎందుకు తప్పుకున్నావ్” అంటూ ఇలాంటి కెప్టెన్ నితీష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దానికి నితీష్ కూడా సరైన సమాధానం చెప్పాడు..”ఆడే ధైర్యం ఉంది కాబట్టే క్రీజ్ లో ఉన్నాను. బంతి సరైన ఎత్తులోనే వచ్చింది. నాకు తగిలింది. నాక్కూడా టైం వస్తుంది కదా” అంటూ నితీష్ వ్యాఖ్యానించాడు.
ఇక ఈ ఘటన కంటే ముందు రన్ కోసం పరుగులు తీస్తున్న సమయంలో రవీంద్ర జడేజా కార్స్ ను గుద్దుకున్నాడు. అది అతడు కావాలని చేసింది కాదు. కానీ దానికి కార్స్ పెద్ద లొల్లి చేశాడు.. తనను కావాలని గుద్దాడని రచ్చ రచ్చ చేయబోయాడు. కానీ తాను అలా చేయలేదని జడేజా వివరణ ఇచ్చాడు. పరుగు తీస్తున్న సమయంలోనే అలా తాకాల్సి వచ్చిందని.. అంతేతప్ప నాకు గుర్తుకోవాల్సిన ఉద్దేశం లేదని జడేజా పేర్కొన్నాడు. దీంతో మైదానంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ తర్వాత అంపైర్లు సర్ది చెప్పడంతో ఆటగాళ్లు మళ్లీ ఆటలో నిమగ్నమయ్యారు.
ప్రస్తుతం జడేజా 17, నితీష్ 10 పరుగులతో ఆడుతున్నారు. భారత్ ఈ కథనం రాసే సమయం వరకు 7 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 85 పరుగులు చేయాలి.. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి.. బుమ్రా, సిరాజ్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్న నేపథ్యంలో భారత బ్యాటర్లు జడేజా, నితీష్ నిదానంగా ఆడుతున్నారు. ఎనిమిదవ వికెట్ కు వీరిద్దరూ ఇప్పటివరకు 26 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తే భారత్ విజయం సాధించే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ సిరీస్లో 2-1 ముందంజ వేయడానికి చాన్స్ ఉంటుంది.
Some words exchange between jadeja and Brydon carse https://t.co/MfGgsOLqiQ
— ADITYA (@140oldtrafford) July 14, 2025