Akhanda 2 Movie : వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపులో ఉన్న బాలయ్య బాబు ఇప్పుడు చేస్తున్న అఖండ 2(Akhanda 2) సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు…ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపు ను సంపాదించి పెట్టాయి. అయితే ఒకానొక సందర్భంలో బాలయ్య బాబు(Balayya Babu) కు వరసగా ఫెయిల్యూర్స్ రావడంతో ఆయన కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ బోయపాటితో చేసిన సింహ లెజెండ్ లాంటి సినిమాలు అతనికి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి పెట్టడంతో మరోసారి బాలయ్య మంచి ఫామ్ లోకి వచ్చాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు నాలుగోసారి బోయపాటితో కలిసి చేస్తున్న అఖండ 2 సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని బాలయ్య బాబు తోపాటు అతని అభిమానులు కూడా భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ఏర్పడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ ఒక గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వెంకటేష్ ఈ సినిమాలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. బాలయ్య బాబు చేసే క్రైమ్స్ ని పట్టుకోడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ గా నియమించబడతారట. మరి ఆయన పాత్ర 15 నిమిషాల పాటు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: ప్రశాంత్ నీల్ – రామ్ చరణ్ కాంబోలో రాబోయే సినిమా స్టోరీ ఇదేనా..?
మొత్తానికైతే వెంకటేష్ బాలయ్య బాబుని అరెస్ట్ చేశాడా? లేదా అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారనుంది. మరి ఈ సినిమాతో బాలయ్య వెంకటేష్ ల కాంబినేషన్ కి మంచి గుర్తింపు లభిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వెంకటేష్ లాంటి స్టార్ హీరో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 200 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు.
అయినప్పటికి ఆయన సోలో హీరో గానే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో నటిస్తూనే గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…గత కొన్ని సంవత్సరాల నుంచి బాలయ్య వెంకటేష్ కాంబినేషన్ ను స్క్రీన్ మీద చూపించాలని చాలామంది దర్శకులు ప్రయత్నం చేస్తున్నప్పటికి అది ఎప్పుడు వర్కౌట్ కాలేదు.
Also Read: మహేష్ బాబు – చిరంజీవి కాంబోలో మిస్ అయిన మూడు సినిమాలు ఇవేనా..?
ఇక మొత్తానికైతే బాలయ్య సినిమాలో వెంకటేష్ నటించడం అనేది అటు వెంకటేష్ అభిమానులను ఇటు బాలయ్య బాబు అభిమానులను ఆనందపరుస్తుందనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలందరిలో బాలయ్య బాబుకి వెంకటేష్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక వాళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం ఆ సినిమా భారీ రికార్డులను కొల్లగొడుతుందనేది వాస్తవం…