Ram Charan Neel combo:’త్రిబుల్ ఆర్ ‘ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan)…ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి విజయాలను అందించి పెట్టాయి. మరి ఇప్పటి వరకు ఎవరికి దక్కనటువంటి ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకొని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు (Buchhi babu) డైరెక్షన్ లో చేస్తున్న పెద్ది(Peddi) సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నప్పటికి తొందరలోనే ఈ సినిమా నుంచి ఒక టీజర్ ని రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా రామ్ చరణ్ ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో నటించబోతున్నాడు అనేది క్లియర్ కట్ గా తెలియజేసింది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కాబట్టి అప్పటివరకు ఈ సినిమా మీద ఉన్న హైప్ ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక బుచ్చిబాబు (Buchhi babu) డైరెక్షన్లో చేస్తున్న సినిమా అయిపోయిన వెంటనే రామ్ చరణ్ సుకుమార్ (Sukumar) తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో డ్రాగన్ (Dragon) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: రజినీకాంత్ చివరి చిత్రం అదేనా..?అతని డ్రీమ్ మూవీ కోసం అడుగులు వేస్తున్నాడా..?
ఈ మూవీ తర్వాత ఆయన ప్రభాస్ తో సలార్ 2(Salaar 2) సినిమాని తెరకెక్కించే అవకాశాలైతే ఉన్నాయి. ప్రభాస్ తో చేసిన సలార్ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే… మరి సలార్ 2 సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా 1940వ సంవత్సరానికి సంబంధించిన కథతో తెరకెక్కబోతుందట… స్వతంత్రం రాకముందు మనవాళ్లు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అప్పటి జీవనశైలి ఎలా ఉండేది అనే ఒక పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: బాలీవుడ్ లో చిరంజీవిని అవమానించింది ఎవరు? పాన్ ఇండియాలో జెండా ఎగురవేస్తాడా..?
మరి ప్రశాంత్ నీల్ ఎప్పుడు చేసిన కూడా కాంటెంపరరీ సినిమాలు చేయకుండా చరిత్రలో జరిగిన విషయాలను వెలికి తీసి 80,90 ల నాటి సినిమాని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి అందులో భాగంగానే ఈ సినిమాని కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తోంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…