DK Shivakumar RCB: కన్నడ జట్టు విజయ యాత్ర విషాదయాత్రగా మిగలడంతో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవి ఎంతతవరకు వెళ్తాయి? ఎక్కడి వరకు దారి తీస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం లభించడం లేదు. ఇక ఇదే సమయంలో కన్నడ జట్టును విక్రయిస్తున్నట్టు మేనేజ్మెంట్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా స్పష్టత లేకపోయినప్పటికీ.. రోజుకో తీరుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కన్నడ జట్టును విక్రయించడానికి మేనేజ్మెంట్ సిద్ధంగా ఉందని.. దానికి సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయని.. లైన్లో చాలామంది కార్పొరేటర్లు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఫ్రాంచైజీ విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రెండు బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని.. అంత చెల్లిస్తే ఎవరైనా జట్టును సొంతం చేసుకోవచ్చని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఇంతవరకు క్లారిటీ లేదు. మరోవైపు జట్టును విక్రయించాలి అనే ఆలోచన తమకు లేదని మేనేజ్మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది. అదే విషయాన్ని వివిధ మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఒకప్పటి కన్నడ జట్టు ఓనర్ తన అంతరంగీకుల ద్వారా జట్టును సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..
ఇక కన్నడ జట్టు విక్రయానికి సంబంధించిన విషయం ఏకంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి చెవిలో కూడా పడింది..” ప్రస్తుత యజమానుల నుంచి కన్నడ జట్టును కొనుగోలు చేయడానికి మీకు నిజంగా ఆసక్తి ఉందా” అని ఆయనను మీడియా ప్రతినిధులు అడగగా..” నేను పిచ్చోడిని కాదు. నా చిన్నప్పటి నుంచి నేను ఈ రాష్ట్రానికి సంబంధించిన క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నాను. నాకు జట్టును కొనుగోలు చేసే సమయం లేదు. ఆయనప్పటికీ ఆ మేనేజ్మెంట్లో భాగస్వామి కావడానికి నాకు అనేక అవకాశాలు వచ్చాయి. నాకు కన్నడ జట్టు లో భాగస్వామ్యం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను రాయల్ చాలెంజర్ కంపెనీ తయారు చేసే మద్యం కూడా తాగను” అని శివకుమార్ మీడియా ప్రతినిధులకు సమాధానంగా చెప్పాడు. ఎప్పుడైతే రాయల్ చాలెంజర్ కంపెనీ తయారు చేసే మద్యం కూడా తాగను అని శివకుమార్ అన్నాడో ఒకసారిగా నవ్వులు పూసాయి. మీడియా ప్రతినిధులు గొల్లున నవ్వారు.. ఈ వ్యాఖ్యలతో శివకుమార్ ఒక్కసారిగా మీడియాలో విశేషమైన ప్రాచుర్యాన్ని పొందారు. జాతీయ మీడియా సంస్థలు కూడా అతడు చేసిన వ్యాఖ్యలను పదేపదే ప్రసారం చేయడం మొదలుపెట్టాయి.
” ఇటీవల కన్నడ జట్టు ఐపిఎల్ సాధించినప్పుడు శివకుమార్ ప్లేయర్లకు ఘన స్వాగతం పలికారు. కోహ్లీతో కలిసి జాతీయ జెండాను ప్రదర్శించారు. కన్నడ జట్టు పతాకాన్ని కూడా ఆయన పట్టుకున్నారు. ఇప్పుడేమో రాయల్ చాలెంజర్స్ కంపెనీ తయారుచేసే మద్యం కూడా తాగను అంటున్నారు. అంతేకాదు కన్నడ జట్టును కొనుగోలు చేసే అవకాశం లేదని.. తనకు ఆ అవసరం కూడా లేదని చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం లో శివకుమార్ తనదైన చాకచక్యాన్ని ప్రదర్శించాడని” నెటిజన్లు అంటున్నారు.