Kubera Movie Full Story: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కుబేర'(Kubera Movie) చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శేఖర్ కమ్ముల(Shekar Kammula) సినిమాలంటేనే ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. ఆ బ్రాండ్ ఇమేజ్ కారణంగానే ఈ సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరిగింది. నాగార్జున, ధనుష్ ఇమేజ్ లు కూడా అందుకు బాగా కలిసొచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ నుండి అభిమానులు కానీ, ప్రేక్షకులు కానీ , ఈ సినిమా స్టోరీ ఏమిటి అనేది మాత్రం కనిపెట్టలేకపోయారు. టీజర్ ని చూస్తుంటే నాగార్జున ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీసర్, ధనుష్ ఒక బిచ్చగాడు. వీళిద్దరి మధ్య ఏదేదో జరిగింది. అంతకు మించి ఆడియన్స్ కి ఏమి అర్థం అవ్వలేదు. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ ని మీ కోసం ఎక్సక్లూసివ్ గా అందిస్తున్నాము చూడండి.
నాగార్జున ఒక ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్. కోట్ల రూపాయిలు సంపాదించే మిలినియర్లు టాక్సులు ఎగ్గొట్టి, బ్లాక్ మనీ ని స్విస్ బ్యాంక్ లో దాచుకోవడం వంటివి నాగార్జున గమనిస్తూ ఉంటాడు. అసలే చార్టెడ్ అకౌంటెంట్, అతనికి తెలియని లొసుగులు ఉండవు. తెలివిగా వాళ్ళ బ్లాక్ మనీ ని మొత్తం కాజేయాలని అనుకుంటాడు. అందుకు ఆయన రోడ్డు మీద ఉండే కొంతమంది బిచ్చగాళ్లను తీసుకొని, ఒక గ్రూప్ గా ఫామ్ చేసి, వాళ్ళ పేర్లతో స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ క్రియేట్ చేయిస్తాడు. బ్లాక్ మనీ మొత్తం ఆ అకౌంట్స్ లో జమ అవుతూ ఉంటుంది. అలాంటి బిచ్చగాళ్ల స్విస్ బ్యాంక్ అకౌంట్స్ లో ధనుష్ అకౌంట్ కూడా ఒకటి. ఇతను నాగార్జున కంటే పెద్ద ముదురు. నాగార్జున కొట్టేసిన ఆ బ్లాక్ మనీ ని మొత్తం ధనుష్ కొట్టేస్తాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేదే స్టోరీ.
ఇప్పుడు అర్థం అయ్యిందా ఈ సినిమాకు ‘కుబేర’ అనే టైటిల్ ని ఎందుకు పెట్టారో. స్టోరీ చదువుతుంటే ఎంతో ఆసక్తిగా ఉంది కదూ. శేఖర్ కమ్ముల ఇలాంటి స్టోరీలను అద్భుతంగా తెరకెక్కించడం లో దిట్ట. ఈ సినిమాని కూడా అలాగే తెరకెక్కించాడట. ఆడియన్స్ ఒక్క క్షణం కూడా రెప్ప ఆర్పకుండా ఈ చిత్రాన్ని మొదటి నుండి చివరి వరకు ఆసక్తిగా చూస్తారట. అంత అద్భుతంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే ని ఆయన రాసుకున్నట్టు తెలుస్తుంది. రోలింగ్ టైటిల్స్ తో కలిపి ఈ సినిమా నిడివి మూడు గంటలకు పైగానే ఉంటుంది. రేపు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ లోనే థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. రేపు విడుదల చేసే ట్రైలర్ లో పైన ప్రస్తావించిన స్టోరీ ఆడియన్స్ కి కూడా అర్థం అయ్యేలా ఉంటుందని సమాచారం.