Trivikram Srinivas’s Next Films: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)…ప్రస్తుతం ఆయన వెంకటేష్ (Venkatesh) తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ఆయన ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయబోతున్నాడు అనే విషయాన్ని ప్రొడ్యూసర్ నాగ వంశీ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు…మరి ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ కొంతమంది హీరోలతో సినిమాలు చేయబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇదే విషయం మీద ప్రొడ్యూసర్ నాగ వంశీ స్పందిస్తూ ట్వీట్ చేయడం విశేషం…ఆ ట్వీట్ లో ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే ప్రస్తుతం త్రివిక్రమ్ గారి చేతిలో వెంకటేష్ తో చేస్తున్న సినిమా చేస్తున్నారు. ఇది ఫినిష అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఈ రెండు ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. వీటికి మించి మరే ప్రాజెక్టు కి ఆయన కమిట్ అవ్వలేదు. ఒకవేళ ఆయన ఇంకేదైనా కొత్త ప్రాజెక్టు కి కమిట్ అయితే దానికి సంబంధించిన వివరాలను నేనే మీకు స్వయంగా తెలియజేస్తాను అంటూ అభిమానులను ఉద్దేశించి ఆయన ఒక ట్వీట్ చేశాడు.
ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయబోతున్న ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో త్రివిక్రమ్ మంచి సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక త్రివిక్రమ్ ఆ హీరోతో సినిమా చేస్తున్నాడు. ఈ హీరోతో సినిమా చేయబోతున్నాడు అంటూ వచ్చే రూమర్లకు చెక్ పెట్టడానికే ఇలాంటి ఒక ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు త్రివిక్రమ్ రామ్ చరణ్ తో కూడా సినిమా చేయబోతున్నాడు ఒక వార్త అయితే వచ్చింది.
Also Read: Sukumar really liked that Balayya movie: బాలయ్య చేసిన ఆ సినిమా అంటే సుకుమార్ కి చాలా ఇష్టమట…
మరి వీటన్నింటిని తట్టుకోలేక నాగవంశీ ట్వీట్ అయితే వేసారని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ తో చేస్తున్న ప్రాజెక్టు పూర్తయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టుని పట్టాలెక్కించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…