MS Dhoni: ధోని కి క్రికెట్ అంటే అంత ఇష్టం మరి.. అభిమానులకు లెజెండ్ అయింది అందుకే..

ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తనకు వయస్సు సహకరించకపోవడంతో, రుతు రాజ్ గైక్వాడ్ కు చెన్నై సారధ్య బాధ్యతలు అప్పగించాడు. అయినప్పటికీ కీలక సమయాలలో సూచనలు, సలహాలు ఇస్తున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 17, 2024 9:19 am

MS Dhoni

Follow us on

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. కొంతమంది లెజెండ్ అని పిలుస్తారు. ఇంకా కొంతమంది క్రికెట్ గోట్ అంటారు. ఎలా పిలిచినా.. ధోని పట్టించుకోడు. ఎందుకంటే ధోని మిస్టర్ కూల్.. కానీ అభిమానులు ఊరుకోరు కదా.. పైగా అతడంటే విపరీతమైన ఇష్టం.. అతడు ఫోర్ కొడితే ఎగిరి గంతేస్తారు. సిక్స్ కొడితే పూనకాలు వచ్చినట్టు ఊగుతారు.. ఈ ఐపిఎల్ సీజన్లో చివర్లో బ్యాటింగ్ కు వస్తున్న ధోని అదరగొడుతున్నాడు. ఫోర్లు, సిక్స్ లతో అలరిస్తున్నాడు. అయితే అలాంటి ధోని ప్రస్తుతం 42 సంవత్సరాల వయసులోనూ క్రికెట్ ఆడుతున్నాడు. అభిమానులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. తన శరీరం సహకరించకపోయినప్పటికీ అద్భుతంగా ఆడుతున్నాడు. చెన్నై జట్టుకు ఏకంగా ఐదు ఐపిఎల్ ట్రోఫీలు అందించిన ధోని.. ఆట కోసం ఏదైనా చేసేందుకు రెడీ అని మరోసారి నిరూపించాడు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తనకు వయస్సు సహకరించకపోవడంతో, రుతు రాజ్ గైక్వాడ్ కు చెన్నై సారధ్య బాధ్యతలు అప్పగించాడు. అయినప్పటికీ కీలక సమయాలలో సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. కీపర్ గా, బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. చివర్లో బ్యాటింగ్ కు తిరుగులేని షాట్లతో అలరిస్తున్నాడు. ” ధాటిగా ఆడుతున్న వ్యక్తి బ్యాటింగ్ ఆర్డర్లో చివర్లో రావడం దేనికి? వయసు సహకరించనప్పుడు ఇంటికి వెళ్లిపోవడం ఉత్తమం కదా.. అతడు చివర్లో వచ్చి బ్యాటింగ్ చేసినప్పటికీ చెన్నై కి ఏం ఉపయోగం అంటూ” విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ధోని ముందుగా బ్యాటింగ్ కు వచ్చి ఆడి ఉంటే చెన్నై ఈపాటికి ప్లే ఆఫ్ వెళ్లేదని.. అతడి నిర్వాకం వల్లే చెన్నై ప్లే ఆఫ్ ముందు కష్టాలు పడుతోందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.

చెన్నై జట్టు కోసం.. మహేంద్ర సింగ్ ధోని చేస్తున్న త్యాగాల గురించి తెలిస్తే మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఎవరూ ముందుకు రారు. గత ఏడాది ఐపీఎల్ సీజన్లో ధోని గాయపడ్డాడు. ఆ గాయం ఇబ్బంది పెడుతున్నప్పటికీ ధోని ఆడాడు. చెన్నై జట్టుకు ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేకపోయాడు. చెన్నై మేనేజ్మెంట్, అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఆ నొప్పిని భరిస్తూనే ధోని ఈ సీజన్ ఆడుతున్నాడు. గాయం ఇబ్బంది పెడుతుండడంతో ఎక్కువగా పరిగెత్త లేకపోతున్నాడు. అందుకే భారీ షాట్లు కొడుతున్నాడు. ధోని కైన గాయం, దాని నుంచి కాపాడుకునేందుకు అతడు వాడుతున్న ఉపకరణాలకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ధోని చేతిలో ఒక బ్యాండ్ కనిపిస్తోంది. సాధారణంగా అది నడుము నొప్పి నివారణకు వాడుతారు. అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి… ధోని ఆ బ్యాండ్ ను విప్పుకుంటూ వెళ్తున్నాడు.. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ధోనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ధోని ఇండియన్ క్రికెట్ కు లభించిన లెజెండ్ అని ప్రశంసిస్తున్నారు.