Non Stop Flights: ప్రపంచంలో నాన్ స్టాప్ గా నడిచే విమాన సర్వీసులు ఇవే..

లండన్ నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం వరకు క్వాంటాస్ ఎయిర్ వేస్ సంస్థ విమానాలు నడుపుతోంది. ఈ రెండు నగరాల మధ్య 14,500 కిలోమీటర్ల దూరం ఉండగా.. ప్రయాణికులను వారి గమ్య స్థానాలను చేర్చేందుకు 17 గంటల 20 నిమిషాల పాటు విమానాలు నాన్ స్టాప్ గా నడుస్తాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : May 17, 2024 9:03 am

Non Stop Flights

Follow us on

Non Stop Flights: బైక్ లేదా బస్సు లేదా కారు లో సుదీర్ఘంగా ప్రయాణిస్తున్నప్పుడు.. వామ్మో ఇంత దూరం ప్రయాణించామా అనిపిస్తుంది.. అదే విమానంలో గంటల తరబడి ప్రయాణిస్తే.. ఎలా ఉంటుంది? అధునాతనమైన సీటింగ్ కెపాసిటీ. శీతల గాలి.. కోరుకున్న తినుబండారాలు అందించే ఎయిర్ హోస్టెస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ అనుభూతే వేరు. అలా సుదీర్ఘంగా గాలిలో చక్కర్లు కొట్టే అంతర్జాతీయ విమాన సర్వీసుల గురించి ఒక్కసారి తెలుసుకుందామా..

న్యూయార్క్ టు సింగపూర్

సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థ అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడి విమానాశ్రయం నుంచి సింగపూర్ లోని చాంగి విమానాశ్రయం వరకు నాన్ స్టాఫ్ సర్వీస్ నడుపుతోంది. ఈ రెండు దేశాల మధ్య 15,332 కిలోమీటర్ల దూరం ఉంది. 16 గంటల 53 నిమిషాలపాటు సింగపూర్ ఎయిర్ లైన్స్ నాన్ స్టాప్ సర్వీస్ నడుపుతుంది.

నెవార్క్ టు సింగపూర్

నెవార్క్ నుంచి సింగపూర్ మధ్య 15,329 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు విమానాశ్రయాల మధ్య నడిచే సర్వీసులు నాన్ స్టాప్ గా 18 గంటల 30 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొడతాయి.

ఆక్లాండ్ నుంచి దోహా వరకు

ఖతార్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమానాలు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నుంచి దోహా వరకు నడుస్తాయి. ఈ రెండు దేశాల మధ్య 14,535 కిలోమీటర్ల దూరం ఉంది. 17 గంటల 30 నిమిషాల పాటు ఈ విమానాలు ఏకధాటిగా నడుస్తాయి.

లండన్ నుంచి పెర్త్ వరకు

లండన్ నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం వరకు క్వాంటాస్ ఎయిర్ వేస్ సంస్థ విమానాలు నడుపుతోంది. ఈ రెండు నగరాల మధ్య 14,500 కిలోమీటర్ల దూరం ఉండగా.. ప్రయాణికులను వారి గమ్య స్థానాలను చేర్చేందుకు 17 గంటల 20 నిమిషాల పాటు విమానాలు నాన్ స్టాప్ గా నడుస్తాయి.

మెల్బోర్న్ నుంచి డల్లాస్ వరకు

ఆస్ట్రేలియా మెల్బోర్న్ నుంచి అమెరికాలోని డల్లాస్ వరకు క్వాంటాస్ ఎయిర్ వేస్ సంస్థ విమానాలు నడుపుతోంది. ఈ రెండు నగరాల మధ్య 14,471 కిలోమీటర్ల దూరం ఉండగా.. క్వాంటాస్ సంస్థ విమానాలు 17 గంటల 35 నిమిషాల సేపు నడుస్తాయి.

ఆక్లాండ్ నుంచి దుబాయ్ వరకు

ఆక్లాండ్ నుంచి దుబాయ్ వరకు 14,193 కిలోమీటర్ల దూరం ఉండగా.. ఏమి రేట్స్ సంస్థ నడుపుతున్న విమానాలు 17 గంటల ఐదు నిమిషాల సేపు ప్రయాణం సాగించి.. ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చుతాయి.

ఆక్లాండ్ నుంచి న్యూయార్క్

ఆక్లాండ్ నుంచి న్యూయార్క్ వరకు 14,209 కిలోమీటర్ల దూరం ఉంది. ఎయిర్ న్యూజిలాండ్, క్వాంటాస్ సంస్థ నడుపుతున్న విమానాలు 16 గంటల 15 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రయాణం సాగిస్తాయి.

సింగపూర్ నుంచి లాస్ ఏంజిల్స్

సింగపూర్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వరకు 14,096 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు నగరాల ప్రయాణికులను వారి గమ్యస్థానాలు చేర్చేందుకు 15 గంటల పది నిమిషాల పాటు సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానాలు నాన్ స్టాప్ గా ప్రయాణిస్తాయి.