JD Chakravarthy Vishnu Priya: సీనియర్ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న వారిలో ఒకరు జేడీ చక్రవర్తి. ఆరోజుల్లో యూత్ ఆడియన్స్ లో ఈయనకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆయన సినిమాలు అప్పట్లో బాగా ఆడేవి. రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పని చేసిన చక్రవర్తి, ఆ తర్వాత విలన్ గా కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలా ఆడియన్స్ కి బాగా అలవాటు అయిన ఆయన వరుసగా సినిమాలు చేస్తూ అప్పట్లో పెద్ద హీరోగా మారాడు. అయితే హీరో గా మార్కెట్ పోయిన తర్వాత ఇప్పుడు వరుసగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఈ జనరేషన్ ఆడియన్స్ ని కూడా ఆయన అలరిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన కీలక పాత్ర పోషించిన చిత్రం ‘గాయపడిన సింహం’.
తరుణ్ భాస్కర్ హీరో గా నటించిన ఈ చిత్రం మే 1 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా, మూవీ టీం తో జేడీ చక్రవర్తి కూడా ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు . అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఈయన ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియా తో చాలా కాలం నుండి ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ సోషల్ మీడియా లో ఒక ప్రచారం సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే వీళ్లిద్దరు కలిసి గతం లో ‘దయ’ అనే సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో నటించారు. అప్పటి నుండి విష్ణు ప్రియా జేడీ చక్రవర్తి ని విపరీతంగా అభిమానిస్తూ వస్తోంది. ఆమె అభిమానించే తీరుని చూసి కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో జరుగుతుంది అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
దీనిపై జేడీ చక్రవర్తి స్పందిస్తూ ‘విష్ణు ప్రియా తో నాకు ప్రేమ వ్యవహారం పెట్టడం దుర్మార్గం. ఆ అమ్మాయి నన్ను గురువు గారు అని పిలుస్తూ ఉంటుంది. మేము ఎప్పుడు కలిసినా ఫిలాసఫీ గురించే మాట్లాడుకుంటాము. ఆమె వ్యక్తిగతం మరియు ప్రొఫెషనల్ లైఫ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. మేమిద్దరం కలుసుకొని దాదాపుగా 3 ఏళ్ళు అవుతోంది’ అంటూ జేడీ చక్రవర్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ ఆయాయ్యి.
