IPL Shocking Collapse: IPL అంటే మనకు పరుగుల వరద గుర్తుకొస్తుంది. బ్యాటర్ల దూకుడు కళ్ళ ముందు కనిపిస్తుంది. బౌలర్ల బేలతనం మదిలో మెదులుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఐపిఎల్ అంటే బౌలర్ల ప్యారడైజ్ గుర్తుకొస్తుంది. కాకపోతే అది అప్పుడప్పుడు మాత్రమే ఆవిష్కృతమవుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు బెంగళూరు పేరు మీద అత్యంత చెత్త రికార్డు ఉంది. బెంగళూరు 49 పరుగులకే ఆల్ అవుట్ అయిన ఆ సందర్భం ఇప్పటికీ ఐపీఎల్లో ఒక చెత్త రికార్డుగా ఉంది.
ఇప్పుడు బెంగళూరు జట్టును మరిపించే విధంగా ఢిల్లీ ఆడుతోంది. ఐపీఎల్ లో భాగంగా సోమవారం ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బెంగళూరు తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో బెంగళూరులో తమ జోరు చూపిస్తున్నారు. ప్రతి బంతిని నిప్పులు చెరిగే విధంగా వేస్తున్నారు. దీంతో ఏడు పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది ఢిల్లీ జట్టు. ప్రతి బ్యాటర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. అసలు ఆడుతోంది ఐపీఎలా? గల్లి క్రికెటా అనే అనుమానం వచ్చే విధంగా మ్యాచ్ సాగుతోంది. ఢిల్లీ బ్యాటర్లు కనీసం క్రీజ్ లో ఉండడానికి కూడా సాహసం చేయడం లేదంట బెంగళూరు బౌలర్ల దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లలో ఏగంగా ముగ్గురు సున్నా పరుగులకు అవుట్ అయ్యారు. ఇందులో కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు.. ఓపెనర్లు ఫారక్ (0), కేఎల్ రాహుల్ (1) ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు.. నితీష్ రానా (1), సమీర్ రిజ్వి (0), స్టబ్స్(5), అక్షర్ పటేల్ (0) దారుణమైన ఆట తీరు కొనసాగించారు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు, హెజెల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టారు. 0 పరుగులకే ఒక వికెట్ కోల్పోయిన ఢిల్లీ జట్టు.. 8 పరుగులకే ఆరు వికెట్లు నష్టపోయింది.
ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ అభిమానులు నిరాశతో చూస్తూ ఉండిపోయారు. అసలు తాము చూస్తోంది ఐపీఎలా? గల్లి క్రికెటా? అర్థం కాని పరిస్థితిలో ఢిల్లీ అభిమానులు ఉండిపోయారు.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు.. దానికి తగ్గట్టుగానే బంతులు వేసింది. పిచ్ నుంచి వస్తున్న సహకారాన్ని బెంగళూరు బౌలర్లు సమర్ధవంతంగా వినియోగించుకున్నారు.. అందువల్లే ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఢిల్లీ జట్టులో అభిషేక్ పోరెల్ (19*), మిల్లర్ (19) టాప్ స్కోరర్ గా నిలిచారు. వీరిద్దరు గనుక నిలబడకపోయి ఉంటే ఢిల్లీ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఈ కథనం రాసే సమయం వరకు ఢిల్లీ జట్టు 7 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.
