CSK vs PBKS : గత సీజన్ లోనే చెన్నై జట్టు కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు. ఆస్థానంలో రుతు రాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా చెన్నై జట్టు యాజమాన్యం నియమించింది. గత సీజన్లో చెన్నై జట్టు ప్లే ఆఫ్ వెళ్లినప్పటికీ.. ఆశించినంత స్థాయిలో ఆట తీరు చూపించకపోవడంతో ఆ దశ నుంచే వెనక్కి వచ్చింది. ఇక ప్రస్తుత సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన చెన్నై.. మూడు ఓటములతో పాయింట్లు పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఆటగాళ్లు గొప్పగా ఆడలేక పోవడం.. చివరి దశలో చేతులెత్తేయడం.. బౌలింగ్ లో లోపాలు.. బ్యాటింగ్లో వైఫల్యాలు చెన్నై జట్టుకు ప్రతిబంధకంగా మారాయి. చివరికి ధోని ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. సొంత వేదికల్లోనూ చెన్నై జట్టు ఓడిపోతుండడం.. ఆ జట్టు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. ” అసలు ఆడుతోంది చెన్నై జట్టేనా అనే అనుమానం కలుగుతోంది. అసలు ఇలా ఎందుకు ఆడుతున్నారో అర్థం కావడం లేదు. బ్యాటింగ్లో సత్తా కనిపించడం లేదు. బౌలింగ్లో గొప్పతనం లేదు. ఫీల్డింగు లోను చురుకుదనం లేదు. ఇలాంటి ఆటగాళ్లు జట్టను ఈసారి విజేతగా నిలుపుతారంటే నమ్మకం లేదని” చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : నాలుగు బంతుల్లో 22 రన్స్.. కట్ చేస్తే సూపర్ సెంచరీ..
పంజాబ్ జట్టుపై
చెన్నై జట్టు ఐపీఎల్లో చాలా టీమ్ లకు సింహ స్వప్నం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే అటువంటి చెన్నై జట్టుకు కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చుక్కలు చూపిస్తోంది. తాజాగా ముల్లన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లోనూ పంజాబ్ జట్టు చెన్నైకి చుక్కలు చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో అదరగొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసి 221 రన్స్ చేసింది.. ప్రియాన్ష్ ఆర్య ఏకంగా సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తదుపరి బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కాన్వే (69), శివం దూబే(42) టాప్ స్కోరర్లు గా నిలిచారు. ఫెర్గు సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ ఓటమి ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద నమోదు చేసుకుంది. గడిచిన ఏడు మ్యాచ్లలో పంజాబ్ జట్టుపై ఆరు ఓటములు ఎదుర్కొంది. ఒకే ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. అయితే చెన్నై జట్టుతో సాధించిన విజయం ద్వారా పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఆటగాళ్లు మొత్తం విఫలమైనప్పటికీ ప్రియాన్ష్ ఆర్య సెంచరీ చేసి ఆకట్టుకోగా.. శశాంక్ సింగ్ ఆఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన పంజాబ్ జట్టు ఒకే ఒక ఓటమిని ఎదుర్కొంది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై జరిగిన మ్యాచ్లలో పంజాబ్ గెలవగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం ఓటమిపాలైంది. ఇక పాయింట్లు పట్టికలో తొలి మూడు స్థానాలలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు కొనసాగుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చివరి స్థానంలో కొనసాగుతోంది.
Also Read : ధోని డక్ ఔట్.. ఇది డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై జట్టేనా..మరీ ఇంత దారుణంగానా..