Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని దాదాపు 50 సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా కీర్తి ప్రతిష్టలను అందుకుంటున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి…ఆయన తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సైతం చాలా తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా బతకడమే కాకుండా మెగా పవర్ స్టార్ గా కూడా సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా ఎదగడమే కాకుండా ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతల గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు… సినిమా ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్ ని సైతం ఆపదలో ఆదుకున్న ఆపద్బాంధవుడుగా కూడా రామ్ చరణ్ కి మంచి గుర్తింపైతే ఉంది. ఇక రామ్ చరణ్ (Ram Charan) ఉపాసన కామినేని (Upasana kaamineni) పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళకి క్లింకార(Climkara) అనే ఒక పాప కూడా ఉంది. అయితే వీళ్ళిద్దరూ ఎలాంటి గొడవలు లేకుండా చాలా అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక రీసెంట్ గా ఉపాసన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు భార్య భర్తల బంధం ఎలా ఉండాలి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు… బిజినెస్ లో వచ్చే లాభాలు నష్టాల మీద ఎప్పటికపుడు సమీక్షలు నిర్వహించినట్టుగానే కుటుంబంలో కూడా భార్య భర్తలు కూడా వాళ్ళ కష్టనష్టాలను ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఒకరికొకరు అండగా నిలబడాలి.
Also Read : హీరోయిన్ జాన్వీ కపూర్ కి ఉపాసన కొణిదెల ఖరీదైన బహుమతి!
ఇలా మాట్లాడుకున్న ప్రతిసారి వాళ్లకు వచ్చిన సమస్యలను తెలుసుకుని వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే ఒక క్లారిటీ అయితే దొరుకుతుంది. దీనివల్ల భార్య భర్తల బంధం స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా ఒకరి మీద మరొకరికి గౌరవం కూడా పెరుగుతుంది.
తద్వారా వాళ్ళు చాలా కాలం పాటు కలిసుండే అవకాశాలు ఉంటాయి అంటూ ఆమె ఓ గొప్ప విషయాన్ని చెప్పింది. అలాగే వాళ్ళ పర్సనల్ విషయాన్ని ప్రస్తావిస్తూ మాకు ఎన్ని పనులు ఉన్నాకూడా వారంలో ఒక్క రోజైన సరే కలిసి కూర్చుని మాట్లాడుకుంటాం అని చెప్పడంతో మెగా ఫాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులందరూ ఆనందపడుతున్నారు.
మరి మొత్తానికైతే రామ్ చరణ్ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికి ఉపాసన బిజినెస్ లతో పాటు కుటుంబ వ్యవహారాలను కూడా చక్కబెడుతుంది అంటూ రామ్ చరణ్ గతంలో ఆమె గురించి చెప్పిన గొప్ప మాటలను మెగా అభిమానులు మరోసారి గుర్తుచేసుకుంటూన్నారు…ఇక వీళ్ళ గురించి తెలుసుకున్న చాలా మంది జనాలు భార్య భర్తలు అంటే వీళ్ళ లా ఉండాలి అంటూ వాళ్ళ మీద ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.
Also Read : రేణు దేశాయ్ కి భారీ ఆర్ధిక సాయం చేసిన ఉపాసన..కన్నీళ్లతో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రేణు దేశాయ్!