PBKS vs CSK : పతిరణ వేసిన రెండవ బంతిని ప్రియాస్ష్ సిక్సర్ కొట్టాడు. మూడో బంతిని మళ్ళీ అదే స్టైల్ లో కొట్టాడు.. నాలుగో బంతిని ఈసారి మరింత బలంగా కొట్టాడు. దెబ్బకు వరుసగా మూడు సిక్సర్లు వచ్చాయి. ఆ తర్వాత ఐదో బంతిని మళ్లీ అంతే బలంగా కొట్టాడు. కాకపోతే ఈసారి అది ఫోర్ గా వెళ్ళింది. మొత్తంగా నాలుగు బంతుల్లో 22 పరుగులు వచ్చాయి. అప్పటిదాకా 80 పరుగులతో ఉన్న ప్రియాన్ష్ ఆర్య.. ఒక్కసారి గా సెంచరీ చేశాడు. పంజాబ్ జట్టుకు ఆపద్బాంధవుడుగా నిలిచాడు.. వాస్తవానికి పంజాబ్ జట్టులో ఏ ఒక్క ఆటగాడు కూడా నిలబడలేకపోయాడు.
చండీగఢ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే 17 పరుగులకే ఓపెనర్ సిమ్రాన్ సింగ్ (0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (9), మార్కస్ స్టోయినిస్(4), నెహల్ వదెరా (9), మాక్స్ వెల్(1) పరుగులకే అవుట్ కావడంతో భారం మొత్తం ప్రియాన్ష్ ఆర్య మోసాడు. చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ సూపర్ సెంచరీ చేశాడు. 39 బంతుల్లోనే సెంచరీ చేసి.. పంజాబ్ జట్టుకు ఆపద్బాంధవుడుగా నిలిచాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ ల సహాయంతో 103 పరుగులు చేశాడు. ఈ కథనం రాసే సమయానికి పంజాబ్ జట్టు 15 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 163 రన్స్ చేసింది. చెన్నై జట్టులో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ చెరి 2 వికెట్లు పడగొట్టారు. నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి చెరో వికెట్ పడగొట్టారు.