CSK vs KKR : ఐపీఎల్ లో చెన్నై జట్టు కూడా పులి, సింహం వంటి జంతువుల లాంటిదే. ముంబై ఇండియన్స్ హవా కొనసాగుతున్న సమయంలో..కోల్ కతా మధ్యమధ్యలో స్ట్రోక్లు ఇస్తున్న క్రమంలో.. హైదరాబాద్ జట్టు గెలుకుతున్న సందర్భంలో.. చెన్నై జట్టు ఐపిఎల్ మొత్తాన్ని రూల్ చేసింది. ఆర్డినరీ ఆటగాళ్లతో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మన్స్ అందించింది. వారందరికీ సాన పెట్టి.. గొప్ప ఆటగాళ్లుగా మార్చిన ఘనత ముమ్మాటికి మహేంద్ర సింగ్ ధోనికి దక్కుతుంది. అందువల్ల చెన్నై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ లో విజేతగా నిలిచింది. బలమైన ముంబై జట్టు సరసన చెన్నై నిలిచింది. అత్యంత విలువైన జట్లలో ముందు వరుసలో ఉంది. ఇంతటి ఘన కీర్తి కలిగిన చెన్నై జట్టు ఇప్పుడు అనామక జట్టు లాగా ఆడుతోంది. పరుగులు పక్కన పెడితే.. రికార్డులు పక్కన పెడితే.. విజయాలు కూడా పక్కన పెడితే.. దారుణమైన ఓటములను చవిచూస్తోంది.. బ్యాటింగ్లో సత్తా చూపించడం లేదు. బౌలింగ్లో సామర్థ్యాన్ని ప్రదర్శించడం లేదు. ఫీల్డింగ్ లో తెగువను కనిపించనీయడం లేదు. మొత్తానికి ఏదో ఆడుతున్నాం అన్నట్టుగా ఆడేస్తోంది. వరుసగా ఓటములు ఎదురవుతున్నా ఆ జట్టు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చివరికి కెప్టెన్ గా ధోని వచ్చినా కూడా జట్టు రాత ఏమాత్రం మారడం లేదు.
Also Read : ధోని వచ్చినా.. చెన్నై మరింత చెత్తగా.. ఇంత ఘోరమైన రికార్డులా..
ఎందుకిలా అయిపోయింది
ఓపెనర్లు చెన్నై జట్టుకు మెరుగైన భాగస్వామ్యం ఇవ్వడం లేదు. మిడిల్ ఆర్డర్ తమ వంతు బాధ్యతను నిర్వర్తించడం లేదు. ఇక టెయిలెండర్లు ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. అసలు ఏ ఒక్క ఆటగాడిలోనూ శ్రద్ధ కనిపించడం లేదు. ఆసక్తి అసలు దర్శనమివ్వడం లేదు. సొంత మైదానంలో వరుసగా ఓటములు ఎదురవుతున్నా చెన్నై జట్టు మారకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అంతు పట్టడం లేదని అభిమానులు వాపోతున్నారు..రచిన్ రవీంద్ర ఓపెనర్ గా విఫలమవుతున్నప్పటికీ అతడికి అవకాశాలు ఇస్తున్నారు. డేవిడ్ కాన్వే పెద్దగా ఆకట్టుకోవడం లేదు. విజయ్ శంకర్ టెస్టు తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. శివం దుబే ఎప్పుడో ఒకసారి బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. రవీంద్ర జడజ తన స్థాయి ఇన్నింగ్ ఆడక చాలా రోజులైంది. ఇక చివర్లో బ్యాటింగ్ కు వచ్చే ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతిమంగా చెన్నై జట్టు పరిస్థితి నానాటికి తీసి కట్టు.. నామం బొట్టు అనే విధంగా మారిపోయింది.. ఇప్పటికైనా తదుపరి మ్యాచ్లలో చెన్నై జట్టు ధోని సారధ్యంలో మారుతుందా? లేక ఇదే ఆట తీరును కొనసాగిస్తుందా? చూడాల్సి ఉంది. అన్నట్టు వరుసగా ఐదు ఓటములు ఎదుర్కొన్న చెన్నై జట్టు.. ప్లే ఆఫ్ వెళ్లాలంటే.. తదుపరి మ్యాచ్లలో కచ్చితంగా గెలవాలి. భారీ పరుగుల తేడాతో విజయాలు సాధించాలి.
Also Read : కోల్ కతా తోపు అనుకుంటే.. చెన్నై ముందు ఇలా తేలిపోయిందేంటి?