CSK vs KKR : గతం ఎంతో గణం.. నేడు మాత్రం అత్యంత అధ్వానం అన్నట్టుగా ఉంది చెన్నై జట్టు పరిస్థితి. ప్రస్తుత సీజన్లో చివరి స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్ లో విఫలమవుతోంది. ఫీల్డింగ్లో నిరాశ పరుస్తోంది. ఇక బౌలింగ్లో అయితే అత్యంత దారుణమైన తీరు ప్రదర్శిస్తోంది. సొంతమైదానంలో వరుసగా ఓడిపోతూ పరువు తీసుకుంటున్నది. ఇక తాజాగా శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అత్యంత దారుణంగా 9 వికెట్ల కోల్పోయి 109 పరుగులు చేసింది. అసలు సొంత మైదానంలో చెన్నై ఆడుతున్న తీరు చూస్తే.. ఆ జట్టు అభిమానులకు కూడా చిరాకు కలిగింది. అసలు ఎందుకురా మ్యాచ్ చూసేందుకు వచ్చామనే భావన వారిలో వ్యక్తం అయింది.. ఇక ఈ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని జట్టుకు కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు. కానీ అనుకున్న స్థాయిలో చెన్నై జట్టును మార్చలేకపోయాడు. సొంత మైదానం లోను పట్టుమని పట్టుమని 120 పరుగులు చేయించలేకపోయాడు. ఇక చివరికి ధోని సైతం ఒక్క పరుగు మాత్రమే చేసి సునీల్ నరైన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు..
Also Read : ఫస్ట్ అన్ క్వాప్డ్ కెప్టెన్ ధోని.. ఇంకా ఎన్నో ఘనతలు..
అత్యంత చెత్త రికార్డులు
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా 9 వికెట్లకు 109 పరుగులు చేసిన.. చెన్నై జట్టు అత్యంత చెత్త రికార్డులను నమోదు చేసింది.. 2022లో వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు 97 పరుగులకే కుప్ప కూలింది. ఆ తర్వాత ప్రస్తుతం చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. 2008లో జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 109 పరుగులకే ఆల్ అవుట్ అయింది..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై చేసిన 103 పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అత్యంత లోయస్ట్ స్కోర్.. అయితే 2019లో చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 70 పరుగులకు కుప్ప కూలింది. ఈ మైదానంలో లోయస్ట్ స్కోర్ చేసిన చెత్త రికార్డు బెంగళూరు జట్టు పేరు మీద కొనసాగుతోంది. ఇక ఈ మ్యాచ్లో చెన్నై జట్టుకు చెందిన ఆరుగురు ఆటగాళ్లు స్పిన్నర్ల బౌలింగ్లో అవుట్ అయ్యారు. ఐపీఎల్ చరిత్రలో స్పిన్ బౌలర్ల చేతిలో ఆరుగురు బ్యాటర్లు అవుట్ కావడం ఇదే తొలిసారి. చెన్నై జట్టు చెత్త బ్యాటింగ్ చూసి.. ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం విశేషం.
View this post on Instagram