ODI captain of India: మెన్స్ క్రికెట్ జట్టుకు సంబంధించి బిసిసిఐ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సుదీర్ఘ ఫార్మాట్ జట్టు సారధిగా గిల్ ను మేనేజ్మెంట్ నియమించింది. ప్రస్తుతం గిల్ ఆధ్వర్యంలో టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయింది. రెండో టెస్టుల గెలిచింది. టీమిండియా రెండవ టెస్టులో గెలవడానికి ప్రధాన కారణం కెప్టెన్గిల్. అతడి బ్యాట్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ నమోదయ్యాయి. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ.. రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు గిల్. అంతకుముందు తొలి టెస్ట్ లో కూడా అతడు సెంచరీ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డమీద తనపై ఉన్న అపప్రదను తొలగించుకున్నాడు. సరికొత్త చరిత్ర సృష్టించాడు.
జట్టును నడిపించే విధానంలో సరికొత్త పద్ధతిని పాటిస్తున్న గిల్.. ఇప్పుడు వన్డే జట్టును కూడా నడిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. టీమిండియాలో కొత్త రక్తాన్ని నింపడానికి కొంతకాలంగా మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలో టెస్ట్ జట్టులో మొత్తంగా యువ రక్తాన్ని నింపింది. టి20 జట్టును కూడా యువకులతో భర్తీ చేసింది.తద్వారా టెస్ట్ జట్టులో కూడా సమూల మార్పులు తీసుకొస్తామని మేనేజ్మెంట్ సంకేతాలు ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే గిల్ ను టెస్ట్ జట్టుకు సారధిగా నియమించింది. ప్రస్తుతం గిల్ ఆధ్వర్యంలోనే టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది.
Also Read: నితీష్ కుమార్ రెడ్డికి గిల్ మామ అవుతాడా? వారి మధ్య బంధుత్వం ఎప్పటినుంచి? వైరల్ వీడియో
టెస్ట్ బృందంలో యువకులను నింపిన మేనేజ్మెంట్.. వన్డేలో కూడా సమూల మార్పులను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే వన్డే జట్టుకు సారథిగా గిల్ ను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ మీడియాలో ఇదే తీరుగా వార్తలు వస్తున్నాయి..” గిల్ కు వన్డే బాధ్యతలు అప్పగిస్తున్నారు. త్వరలో శ్రీలంక జట్టుతో జరిగే వన్డే సిరీస్ కు గిల్ నాయకత్వం వహిస్తాడు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెస్ట్ సిరీస్ పూర్తయిన తర్వాత మేనేజ్మెంట్ ప్రకటన చేసే అవకాశం ఉందని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే మేనేజ్మెంట్ రోహిత్ శర్మతో మాట్లాడినట్టు తెలుస్తోంది. గిల్ ను వన్డే జట్టుకు సారధిగా ఎందుకు నియమిస్తున్నామో స్పష్టం చేసినట్టు సమాచారం. అందువల్లే జాతీయ మీడియాకు బీసీసీఐ పెద్దలు లీకులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ధోని తర్వాత మళ్లీ ఇప్పుడే రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా ఆ విజయం సాధించడం గమనార్హం. మరో రెండు సంవత్సరాలలో దక్షిణాఫ్రికా వేదికగా 50 ఓవర్ల ఫార్మాట్ ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రపంచ కప్ కోసం ఇప్పటినుంచే జట్టను సిద్ధం చేసే పనిలో పడింది మేనేజ్మెంట్. ఎందుకంటే గడచిన వరల్డ్ కప్ ను టీమిండియా వెంట్రుక వాసిలో కోల్పోయింది. ఈసారి అలా జరగకుండా ఉండాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Also Read: అటు ఆర్చర్.. ఇటు బుమ్రా.. లార్డ్స్ లో రాణించే జట్టు ఏదో?
రోహిత్ ఇప్పటికే సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. గత ఏడాది పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఇప్పుడు వన్డే ఫార్మేట్ కు సారధిగా ఉన్నాడు. టెస్టులలో సరిగ్గా ఆకట్టుకోలేకపోతున్నాడని మేనేజ్మెంట్ ఇటీవల అతడితో మాట్లాడింది. దీంతో అతడు టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకున్నాడు. అయితే వన్డేలో రోహిత్ బాగానే ఆడుతున్నప్పటికీ.. అతడిని ఎందుకు తప్పిస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. మరోవైపు టీమ్ ఇండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన సారధిగా ఉండాలని రోహిత్ భావిస్తున్నాడు. కానీ ఇంతలోనే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం రోహిత్ అభిమానులకు మింగుడు పడడం లేదు. మరి దీనిపై రోహిత్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూడాల్సి ఉంది.