Eng vs Ind 3rd Test: తొలి టెస్ట్ లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లాండ్.. రెండవ టెస్ట్ కి వచ్చేసరికి ఒక్కసారిగా ఉత్సాహాన్ని నీరుగార్చుకుంది. తొలి టెస్ట్ లో ఓడిపోయిన టీమ్ ఇండియా.. రెండవ టెస్టులో విజయం సాధించింది.. తద్వారా సిరీస్ ను సమం చేసింది. దీంతో గురువారం నుంచి మొదలయ్యే లార్డ్స్ టెస్ట్ పై ఆసక్తి నెలకొంది. రెండవ టెస్టులో గెలిచిన నేపథ్యంలో టీమిండియా ఉత్సాహం లో ఉండగా.. ఓడిపోయిన ఇంగ్లాండ్ ఒక రకమైన ఆత్మ రక్షణ ధోరణిలో ఉంది.. ఈ నేపథ్యంలో జట్టులో కీలక మార్పు చేసింది. టంగ్ ను పక్కనపెట్టి అతడి స్థానంలో ఆర్చర్ ను తీసుకుంది. నాలుగు సంవత్సరాల తర్వాత ఆర్చర్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు.
Also Read: నాలుగు రోజులకోసారి రంగు వేసుకుంటున్నాను.. విరాట్ భయ్యా.. ఈ మాటలు తగలాల్సిన వాళ్ల కు తగిలాయి అంతే!
తొలి టెస్ట్ లో అద్భుతమైన బౌలింగ్ వేసిన బుమ్రా.. రెండవ టెస్టులో విశ్రాంతి తీసుకున్నాడు. రెండో టెస్టులో బుమ్రా లేకుండానే భారత్ విజయం సాధించింది. లీడ్స్ మైదానంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని..ఎడ్జ్ బాస్టన్ లో విజయం సాధించింది. ముఖ్యంగా బౌలింగ్లో అదరగొట్టింది. బ్యాటింగ్లో దుమ్మురేపింది. ప్రతి సెషన్ లో కూడా అదరగొట్టింది. ప్లాట్ పిచ్ పై భారత బౌలర్లు వికెట్లు పడగొడతే.. ఇంగ్లాండ్ బౌలర్లు తేలిపోయారు. ఈ నేపథ్యంలో లార్డ్స్ లో జీవం ఉన్న పిచ్ రూపొందించాలని తెలుస్తోంది. బుమ్రా జట్టులోకి వస్తున్నాడు కాబట్టి ఇంగ్లాండ్ బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు.. ఇంగ్లాండ్ జట్టులో స్మిత్, బ్రూక్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. డకెట్ రెండవ టెస్టులో తేలిపోయాడు.. ఈ నేపథ్యంలో అతడి నుంచి ఇంగ్లాండ్ జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మరోవైపు భారత జట్టులో కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి విఫలమవుతున్నారు. వీరిద్దరూ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడాల్సి ఉంది.
గిల్ అద్భుతమైన ఫామ్ భారత జట్టుకు కొండంత బలాన్ని అందిస్తోంది. యశస్వి జోరు మీద ఉన్నాడు.. రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. పంత్ అదరగొడుతున్నాడు. జడేజా సత్తా చాటుతున్నాడు. ఇక రెండో టెస్టులో ఆకాష్ అదరగొట్టాడు. సిరాజ్ దుమ్మురేపాడు. అయితే ఈ మ్యాచ్లో ప్రసిధ్ ను పక్కన పెట్టే అవకాశం ఉంది. రెండో టెస్టులో విఫలమైనప్పటికీ నితీష్ కుమార్ రెడ్డికి మరో అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి.. ఇంగ్లాండ్ జట్టులో రూట్, స్టోక్స్ అంత గొప్పగా ఆడటం లేదు.. వారిద్దరి నుంచి ఇంగ్లాండ్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఆర్చర్ జట్టులోకి వస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ కాస్త ఉత్సాహంతో కనిపిస్తోంది.
రెండో టెస్టులో విఫలమైన నేపథ్యంలో.. లార్డ్స్ పిచ్ ను బౌలింగ్ కు సహకరించే విధంగా రూపొందించినట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఒత్తిడి తీసుకురావడం వల్లే పిచ్ ను ఆ విధంగా రూపొందించారని సమాచారం. అయితే ఇంగ్లాండ్ జట్టులో వోక్స్, కార్సే వంటి బౌలర్లు ఉన్నప్పటికీ.. అంతగా ప్రభావం చూపించలేకపోయారు.. మరి మూడో టెస్టులో వారు ఏ స్థాయిలో బౌలింగ్ వేస్తారో చూడాల్సి ఉంది. మొదటి టెస్టులో భారత్ బౌలర్ బుమ్రా ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్టులో ఆకాష్, సిరాజు అద్భుతం చేశారు. గెలిచిన టెస్టులో, ఓడిన టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్లు ఈ స్థాయిలో ప్రతిభ చూపించలేకపోయారు. ఇది ఇంగ్లాండ్ జట్టును ఒక రకంగా ఇబ్బందికి గురిచేస్తోంది. మరి లార్డ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్లు ఏ మేరకు ప్రతిభ చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.