Shubman Gill And Nitish Reddy: టీమిండియాలో యువ ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. గత ఏడాది జరిగిన ఆస్ట్రేలియా టూర్ లో మెల్బోర్న్ వేదికగా శతకం సాధించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా ఆడుతున్నాడు. అయితే ఇంతవరకు అతనికి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం రాలేదు. ఎందుకంటే నితీష్ తొలి టెస్టులో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. బౌలింగ్లో తేలిపోయాడు. బ్యాటింగ్లో విఫలమయ్యాడు. దీంతో మేనేజ్మెంట్ అతనిపై నమ్మకం ఉంచి మరో అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ రెడ్డి మూడో టెస్ట్లో చోటు సంపాదించుకున్నాడు.
Also Read: దుమ్ములేపుతున్న ప్రభాస్ లేటెస్ట్ లుక్స్..’స్పిరిట్’ లో ఇలాగే కనిపించబోతున్నాడా?
లార్డ్స్ లో మొదలైన మూడో టెస్టులో నితీష్ ప్రతిభ చూపించాడు. ఈ పిచ్ పై వికెట్లు తీయడానికి ఆకాష్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్ ఇబ్బంది పడుతున్న వేళ.. నితీష్ అదరగొట్టాడు. అద్భుతమైన బంతులు వేసి.. ఒకే ఓవర్ లో వరుస బాల్స్ మధ్య ఓపెనర్లను వెనక్కి పంపించాడు . డకెట్, కార్సే ను బంతుల వ్యవధిలో అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 44 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత పోప్, రూట్ మూడో వికెట్ కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఇంగ్లాండ్ కాస్త గట్టెక్కింది.
ఇంగ్లాండ్ ఓపెన్ వరుస బంతుల వ్యవధిలో వెనక్కి పంపించిన నేపథ్యంలో టీమిండియా యువ బౌలర్ నితీష్ కుమార్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సిరీస్ లో ప్రమాదకరమైన ఆటగాడిగా పేరుపొందిన డకెట్ నితీష్ బౌలింగ్లో కోలుకోలేకపోయాడు.. నితీష్ బంతిని అంచనా వేయలేక అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ కూడా నితీష్ బంతిని అంచనా వేయకుండానే కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు కొద్ది వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే 44 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది.
నితీష్ వరుస బంతుల్లో వికెట్లు తీసిన నేపథ్యంలో మైదానంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. టీ మీడియా సార్ అది శభాష్ రా మామ.. “సూపర్ బాల్ రా మామ” అంటూ కామెంట్స్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డిని “రెడ్డి రెడ్డి” అని పేర్కొన్నాడు. గిల్ అన్న ఆ మాటలు వికెట్ల లోని స్టంపులకు ఏర్పాటు చేసిన కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో పడటంతో చర్చ నడుస్తోంది. మొత్తానికి నితీష్ కుమార్ రెడ్డికి.. టీమిండియా సారధికి మంచి బాండింగ్ ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ బాండింగ్ వల్లే నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లను వెంట వెంటనే పడగొట్టాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ వీడియో వైరల్ అయిన తర్వాత నితీష్, గిల్ మధ్య బంధుత్వం ఉందా? అందుకే అని మామ అని పిలిచాడా? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే వారిద్దరి మధ్య ఎటువంటి బంధుత్వం లేదు.. కేవలం వారిద్దరు తోటి ఆటగాళ్లు మాత్రమే. నితీష్ కుమార్ రెడ్డిని ప్రోత్సహించడానికి మాత్రమే గిల్ అలా సంబోధించాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
View this post on Instagram