Indian Chess Champion: విశ్వనాథన్ ఆనంద్ వల్ల కాలేదు. ఇంకా హేమాహేమీలు తలపడినప్పటికీ సాధ్యం కాలేదు. కానీ ఆ రికార్డును మన గుకేష్ సాధిస్తున్నాడు. వరుస విజయాలతో ఇప్పటికే తిరుగులేని సత్తాను చాటుతున్న అతడు.. చదరంగంలో తనకు మాత్రమే సాధ్యమైన ఎత్తులతో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఎంతో ఉత్కంఠగా జరుగుతున్న గ్రాండ్ చెస్ టూర్ లో గుకేష్ సత్తా చూపిస్తున్నాడు. డిపెండింగ్ వరల్డ్ ఛాంపియన్ హోదాలో తిరుగులేని ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. గుకేష్ దెబ్బకు కార్ల్ సన్ బిత్తర పోయాడు.
Also Read: బుమ్రా ఆడతాడా? లేదా? రెండో టెస్టుకు ఎటూ తేల్చుకోలేక టీమ్ ఇండియా మేనేజ్మెంట్ సతమతం!
ఇటీవలి ప్రపంచ చదరంగ ఛాంపియన్ షిప్ పోటీలో గుకేష్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. నాటి మ్యాచ్ లో కార్ల్ సన్ ను గుకేష్ ఓడించాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు. ఇటీవల కాలంలో భారతదేశానికి చెందిన ఏ చదరంగ క్రీడాకారుడు కూడా అందుకోలేని ఘనతను గుకేష్ సొంతం చేసుకున్నాడు..కార్ల్ సన్ ను వరుస ఎత్తుల్లో చిత్తుచేసి అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. అయితే అదే ఊపును ఇప్పుడు గుకేష్ కొనసాగిస్తున్నాడు. క్రొయేషియాలో జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ -2025 గ్రాండ్ చెస్ టూర్లో గుకేష్ సత్తా చాటుతున్నాడు.
క్రొయేషియాలో జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ -2025 గ్రాండ్ చెస్ టూర్ లో గుకేష్ ఆరో రౌండ్ లో మాగ్నస్ పై గుకేష్ అద్భుతమైన విజయాన్ని సాధించాడు . ఈ టోర్నీలో ఇప్పటివరకు గుకేష్ వరుసగా ఐదు విజయాలు సాధించాడు. రెండు పాయింట్లు లీడ్ లో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్ లో ప్రారంభంలో కార్ల్ సన్ దూకుడు కొనసాగించాడు. అయితే అతడి ఎత్తులను అంచనా వేసిన గుకేష్.. ఆ తర్వాత తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. వరుస రౌండ్లలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. చివరికి విజయాన్ని దక్కించుకున్నాడు.. వాస్తవానికి గుకేష్ ఎత్తులను కార్ల్ సన్ అంచనా వేయలేకపోయాడు. ఆ స్థాయిలో అదరగొడతాడని ఊహించలేకపోయాడు. తన ప్రత్యర్థికి తన ఎత్తులు తెలియనీయకుండా గుకేష్ అత్యంత చాకచక్యాన్ని ప్రదర్శించాడు. చివరికి వరుస రౌండ్ లలో ఓడించి విజయం సాధించాడు. ఒకానొక సందర్భంలో కార్ల్ సన్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయాడు. అందువల్లే తప్పులు చేసి ఓటమిని కొని తెచ్చుకున్నాడు. ఓడిపోయిన తర్వాత కార్ల్ సన్ ముభావంతో వెళ్లిపోయాడు.
Also Read: అప్పట్లోనే ఆ పని.. శుభ్‌మన్ గిల్ పాత వీడియో వైరల్
మరో రెండు గేమ్స్ లో గుకేష్ మాగ్నస్ తో తలపడాల్సి ఉంది. ఇక ఇప్పటికే ర్యాపిడ్ విభాగంలో చెస్ పోటీలు ముగిశాయి. ఆ తర్వాత బ్లిట్జ్ ఫార్మాట్ మొదలవుతుంది. ఈ ఫార్మాట్లో విజయం సాధించిన వారు ఛాంపియన్ అవుతారు. బ్లిట్జ్ ఫార్మాట్లో మాగ్నస్ కు తిరుగు లేకపోయినప్పటికీ.. ఇటీవల కాలంలో అతడు తడబడుతున్నాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్ లో బ్లిట్జ్ ఫార్మాట్ లోనే మాగ్నస్ తలవంచాడు.. గుకేష్ ఎత్తులను అర్థం చేసుకోలేక తలవంచాడు. చివరికి ఓడిపోయి రన్నర్ అప్ గా నిలిచాడు.
కార్ల్సన్కు మరోసారి చెక్ పెట్టిన గుకేశ్
వరల్డ్ No.1 చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ను డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ మరోసారి ఓడించారు. క్రోయేషియాలో జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్-2025 గ్రాండ్ చెస్ టూర్ ఆరో రౌండ్లో మాగ్నస్పై గుకేశ్ విజయం సాధించారు. టోర్నీలో వరుసగా 5… pic.twitter.com/eMGfjM7Y1W
— ChotaNews App (@ChotaNewsApp) July 4, 2025