Bumrah Injury Update: ఐదు టెస్టుల సిరీస్లో భారత్ వెనుకబడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో సిరీస్ 1-0 తో ఇంగ్లాండ్ ముందంజ వేసింది. అంతేకాదు నేటి నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులోనూ ఇంగ్లాండు అత్యంత ఉత్సాహంగా కనిపిస్తోంది. ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అత్యంత సమర్థవంతంగా దర్శనమిస్తోంది. అందువల్లే రెండో టెస్ట్ కు ఎటువంటి మార్పులు లేకుండానే రంగంలోకి దిగుతోంది. ఎటోచ్చీ టీమిండియాకే ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఓపెనర్లు, వన్ డౌన్ వికెట్ వరకు టీం ఇండియాకు పెద్దగా ఇబ్బంది లేదు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ అత్యంత దారుణంగా ఉంది. ఇక ఫీల్డింగ్ అయితే అత్యంత నాసిరకం. అందువల్లే రెండో టెస్టుకు ఇంకా కొద్ది గంటలే సమయం ఉన్నప్పటికీ తుది జట్టు విషయంలో మేనేజ్మెంట్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయింది.
Also Read: నాలుగు క్యాచ్ లు మిస్.. యశస్వి జైస్వాల్ విషయంలో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం..
తొలి టెస్ట్ లో బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. అతడు మినహా మిగతా బౌలర్లు ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. అంతేకాదు వన్డే తరహాలోనే పరుగులు ఇచ్చారు. సిరాజ్, ప్రసిద్, శార్దుల్ ఠాకూర్ తేలిపోయారు. కట్టుదిట్టంగా బంతులు వేయాల్సిన చోట లయ తప్పారు.. ఆఫ్ సైడ్ బంతులు వేయడంలో దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు. 300కు మించి పరుగుల లక్ష్యం ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా దూకుడు కొనసాగించారు. బీభత్సంగా బ్యాటింగ్ చేసి టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త సంచలనం నమోదు చేశారు.
రెండవ ఇన్నింగ్స్ లో బుమ్రా వికెట్లు తీయకపోవడంతో ఆ ప్రభావం జట్టు విజయం మీద చూపించింది. బుమ్రా మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అతడిని రెండవ టెస్టుకు దూరంగా ఉంచాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. గత కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో కూడా ఇదే తీరిగా వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో రెండవ టెస్టులో అతని స్థానంలో ఎవరిని ఆడించాలనే దానిపై ఇంతవరకు స్పష్టత లేకుండా పోయింది. బుమ్రా స్థానంలో ఆకాష్ లేదా అర్ష్ దీప్ సింగ్ ను తీసుకుంటారా? ఎవరి వైపు మొగ్గు చూపించాలి? శార్దూల్ పక్కన పెడితే నితీష్ ను ఆడిస్తారా? సాయి సుదర్శన్, కరణ్ నాయర్ లను పక్కన పెడితే వారి స్థానంలో ఎవరికి చోటు ఇవ్వాలి? అనే ప్రశ్నలకు మేనేజ్మెంట్ వద్ద సమాధానాలు లేవు.
Also Read: మనసు విప్పిన హార్దిక్ విడాకుల తర్వాత మొదటి స్పందన
ప్రత్యేకమైన స్పిన్ బౌలర్ లేకపోవడంతో ఇంగ్లాండ్ జట్టు తొలి టెస్టులో భారీ టార్గెట్ ను సైతం ఈజీగా చేజ్ చేసింది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం కులదీప్ ను తుది జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. అతడు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా బంతిని మెలి తిప్పగలడు. బ్యాటింగ్ కూడా ఎనిమిదవ నెంబర్లో సమర్థవంతంగా చేయగలడు. అయితే శార్దూల్ ఠాకూర్ మీద భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ అతడు వాటిని చేరుకోలేకపోయాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డి పూర్తి సామర్థ్యంతో ఉన్నప్పటికీ.. అతడిని జట్టులోకి తీసుకుంటారా? అనేది చూడాల్సి ఉంది.. ఇక రెండవ ఇన్నింగ్స్ లో గిల్, జైస్వాల్ విఫలం కావడం జట్టు విజయంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ లెక్కన వారు రెండో టెస్టులో అదరగొట్టాల్సి ఉంది.. అందువల్లే ఇన్ని వైఫల్యాలను సరిదిద్దుకొని మెరుగైన ఆటగాళ్లతో తుది జట్టును మేనేజ్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.