Decisions for 20-year-olds: ప్రతి ఒక్కరి జీవితం నాలుగు దశలు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. వీటిలో ఒకటి బాల్యం, రెండు కౌమారం, మూడు యవ్వనం, నాలుగో వృద్ధాప్యం. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం, కౌమారం తల్లిదండ్రుల వద్దే గడిచిపోతుంది. అంటే కనీసం 20 సంవత్సరాలు వచ్చేవరకు తల్లిదండ్రులపైనే ఆధార పడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేవలం చదువుపై మాత్రమే దృష్టి పెడతారు. ఆ తర్వాత కెరీర్ కు సంబంధించిన విషయంపై దృష్టి పెట్టాలి. అయితే 20 సంవత్సరాల వయసులోనే తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నిలపెట్టే అవకాశం ఉంది. అంటే ఈ వయసులో తీసుకుని నిర్ణయాలే జీవితం ఎలా ఉంటుంది అని నిర్ణయించుకోవచ్చు. మరి ఈ వయసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి?
చాలామంది 20 సంవత్సరాలు రాగానే తమకు స్వేచ్ఛ దొరికిందని విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉంటారు. కొందరు అడ్డు అదుపు లేకుండా స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇదే సమయంలో లోకం కొత్తగా కనిపిస్తుంది. అంతేకాకుండా కొన్ని కొత్త అలవాట్లు ఏర్పడతాయి. వ్యసనాల బారిన పడే ప్రమాదం కూడా ఈ వయసులోనే ఎక్కువగా ఉంటుంది. మరి ఈ వయసులో ఏం చేయాలి?
Also Read: వివేకానందుడు ఎలా చనిపోయాడు? తనను కలవరపెట్టవద్దని చివరలో ఎందుకు చెప్పాడు
20 సంవత్సరాల వయసు రాగానే దాదాపు చదువు పూర్తి అవుతుంది. అయితే పై చదువులు చదివే వారు కొందరు అయితే.. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు మరికొందరు ఉంటారు. ఎలాంటి ఉద్యోగం చేయాలి అని నిర్ణయించుకోవాల్సిన సమయం ఇదే. ఇప్పటివరకు మనం చదివిన చదువు ఏ ఉద్యోగానికి ఉపయోగపడుతుంది? ఏ జాబ్ చేస్తే బాగుంటుంది? అనేది నిర్ణయించుకోవాలి. అంతేకాకుండా భవిష్యత్తులో ఉద్యోగం చేయాలా? వ్యాపారం చేయాలా? అనేది కూడా నిర్ణయించుకునేది ఈ వయసులోనే. ఈ వయసులో వ్యాపారం చేయాలని అనుకుంటే ఇక జీవితాంతం వ్యాపారంలోనే ఉండిపోవాలి. లేదా ఉద్యోగం చేయాలని అనుకుంటే ఆ రంగంలోనే ఉండాల్సి ఉంటుంది.
అందువల్ల 20 సంవత్సరాల వయసు వచ్చిన వారు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ సమయంలో వీరి మెదడు పనితీరు మెచ్యూరిటీ కాకపోవచ్చు. కానీ తల్లిదండ్రులు లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వారు చెప్పిన సూచనలు పాటిస్తూ తమ జీవితానికి ఏం కావాలో తెలుసుకొని అందుకోసం నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఈ వయసులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని విషయంలో చాలా తర్జనభజన పడుతూ ఉంటారు. కొందరు సరైన నిర్ణయం తీసుకోలేక ఆందోళన చెంది అనారోగ్యాలను బారిన పడిన వారు కూడా ఉన్నారు.
Also Read: రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రామ్ దేవ్ బాబా ఏం చెప్పారంటే?
అయితే పెద్దగా ఆందోళన చెందకుండా నిపుణుల సలహా తీసుకుంటూ.. ఇప్పటివరకు సక్సెస్ఫుల్ జీవితాన్ని అనుభవించేవారు ఎలాంటి పనులు చేశారు? ఏ రంగంలో అయితే తమకు బాగుంటుంది? అనే విధంగా ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. అలా చేయడం ద్వారా జీవితంలో అనుకున్నది సాధిస్తారు. అయితే ఈ వయసులో కేవలం నిర్ణయాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటే.. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక క్రమ పద్ధతిలో ఉండగలుగుతారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు ఇబ్బందులకు గురవుతారు.
View this post on Instagram