Shubman Gill Records: పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి గిల్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. అనితర సాధ్యమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్ లో అతడు ఒక ద్వి శతకం, శతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్సన్ – టెండూల్కర్ సిరీస్లో 300కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అతని రికార్డ్ సృష్టించాడు.. ముఖ్యంగా ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో.. టీమిండియా పీకలోతు కష్టాల్లో ఉన్నప్పుడు గిల్ మైదానంలోకి వచ్చాడు. అత్యంత విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియా భారీ స్కోర్ సాధించేందుకు కారణమయ్యాడు.
Also Read: టీమిండియా బంగ్లాదేశ్ టూర్ రద్దు.. షాక్ ఇచ్చిన బిసిసిఐ
గిల్ అద్భుతమైన బ్యాటింగ్ నేపథ్యంలో అనేక రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సేన (సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల సారధులతో పోల్చి చూస్తే అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. అందువల్లే అతడిని టీమిండియా భావిభారత నాయకుడిగా భారత మేనేజ్మెంట్ వ్యవహరిస్తోంది. కచ్చితంగా అతని ఆధ్వర్యంలో టీమిండియా మరిన్ని విజయాలు సాధిస్తుందని భావిస్తోంది. తొలి టెస్ట్ లో ఓడిపోయినప్పటికీ.. రెండవ టెస్టులో టీమ్ ఇండియా వెంటనే పట్టు బిగించింది. పోయిన చోట వెతుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.
రెండవ టెస్టులో ద్వి శతకం చేసిన నేపథ్యంలో గిల్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. అతడు ఆడిన తీరు మాజీ ప్లేయర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లెజెండరీ ఆటగాళ్లు గిల్ ఆట తీరును గొప్పగా ఉందని అభివర్ణిస్తున్నారు. అతడు ఓపికతో ఆడిన విధానం.. సమయోచితంగా పరుగులు తీసిన తీరు అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్ పాత వీడియో ఒకటి బయటకు వచ్చింది.. ఈ సందర్భంగా అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.
Also Read: గిల్, జడేజా మరో అద్భుతం చేశారు
“సుదీర్ఘ ఫార్మాట్ విభిన్నమైనది. ఈ ఫార్మాట్లో ఆడే ఆటగాళ్లకు ఓపిక చాలా అవసరం. త్వరగా అవుట్ అయితే మాత్రం రోజు మొత్తం బయట కూర్చోవలసి ఉంటుంది. అందువల్ల అత్యంత ఓపికతో సుదీర్ఘ ఫార్మాట్ ఆడాల్సి ఉంటుంది. క్రీజ్ లో ఉంటేనే పరుగులు తీయడానికి అవకాశం బంతిని గాల్లోకి ఎట్టి పరిస్థితిలోనూ కొట్టొద్దు.. కేవలం గ్రౌండ్లో మాత్రమే ఆడాలి. ఫుల్ టాస్ బంతులను దూకుడు ప్రదర్శించాలి.. అలాగని వీరోచితంగా ఆడితే ఇబ్బందికరంగా ఉంటుంది. జట్టును ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచకూడదు. ఆటగాళ్లతో సమన్వయం చేసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దూకుడు ప్రదర్శించాలి.. సుదీర్ఘ ఫార్మాట్ కు దూకుడు అనేది అత్యంత స్వల్పంగానే అవసరం పడుతుంది.. నిదానమే ప్రధానం.. అనే సామెత సుదీర్ఘ ఫార్మాట్ లో నిత్యం ప్రదర్శించాల్సి ఉంటుందని” ఆ వీడియోలో గిల్ వ్యాఖ్యానించాడు.. ఇంగ్లీష్ జట్టుపై ద్వి శతకం చేసిన నేపథ్యంలో ఒకప్పుడు గిల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. గిల్ నాడు మాట్లాడిన మాటలకు తగ్గట్టుగానే రెండవ టెస్టులో బ్యాటింగ్ చేశాడు. ఏకంగా ద్వి శతకం చేశాడు.
శుభ్‌మన్ గిల్ పాత వీడియో వైరల్
టెస్ట్ క్రికెట్లో ఓపికతో ఆడాలి, త్వరగా అవుట్ అయితే రోజంతా బయట కూర్చోవాల్సి వస్తుంది
క్రీజులో ఉంటేనే పరుగులు సాధ్యం, బంతిని గాలిలోకి కొట్టకుండా గ్రౌండ్‌గా ఆడాలి
ఫుల్ టాస్ వంటి వదులైన బంతులపై దూకుడుగా ఆడాలి
జట్టును నిరాశపర్చకుండా ఆడాలి
— ChotaNews App (@ChotaNewsApp) July 4, 2025