DC Vs MI IPL 2025: అక్షర్ పటేల్ చేసిన ఆ ఫీల్డింగ్ విన్యాసాలు అతడికి జట్టులో సుస్థిరమైన స్థానాన్ని కల్పించేలా చేశాయి. అయితే ఇప్పుడు కూడా అతడు అంతకుమించి అనేలాగా ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అక్షర్ పటేల్.. ఆ జట్టుకు వరుసగా నాలుగు విజయాలు అందించాడు. అంతేకాదు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండేలా చేశాడు. గతంలో ఎన్నడు లేని విధంగా ఢిల్లీ జట్టుకు సరికొత్త శక్తియుక్తులు అందిస్తున్నాడు. అందువల్లే ఢిల్లీ జట్టు ఈసారి కొత్తగా కనిపిస్తోంది. కేఎల్ రాహుల్, అభిషేక్ పోరేల్, కరణ్ నాయర్, అశుతోశ్ శర్మ, స్టబ్స్, కులదీప్ యాదవ్ వంటి వారిని సక్రమంగా వినియోగించుకుంటూ జట్టుకు విజయాలు అందేలాగా చేస్తున్నాడు. అందువల్లే అక్షర్ పటేల్ పేరు మారు మోగిపోతున్నది. పొట్టి ఫార్మాట్ లో జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్న అక్షర్ పటేల్ భవిష్యత్తు కాలంలో టీమిండియా టి20 కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఢిల్లీ వేదికగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ అద్భుతమైన విన్యాసం చేశాడు. మేటి మేటి ఫీల్డర్లు కూడా భయపడే విధంగా తన ఒళ్ళును విల్లు లాగా వంచి.. రయ్యిన దూసుకు వస్తున్న బంతిని ఆపాడు. అంతేకాదు మరో మారు ఫీల్డింగ్ లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.
Also Read: నాటు కొట్టుడు స్టైల్.. ఇదీ తెలుగోడు తిలక్ వర్మ అంటే.. అర్థమైందా హార్దిక్కూ!
అమాంతం ఎగిరాడు
ముంబై ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైకర్ గా నమన్ ధీర్, మరో ఎండ్ లో తిలక్ వర్మ ఉన్నాడు. స్టార్క్ 18 ఓవర్ బౌలింగ్ వేస్తున్నాడు. తొలి బంతి డాట్ అయింది. రెండో బంతి ని నమన్ ఫోర్ కొట్టాడు, మూడవ బంతిని కూడా అదే విధంగా బౌండరీకి తరలించాడు. నాలుగో బంతిని కూడా భారీ షాట్ కొట్టాడు. చూసేవాళ్ళు అది సిక్సర్ అని అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్.. అమాంతం పక్షి లాగా ఎగిరాడు. అంతేకాదు ఢిల్లీ ప్రేక్షకులకు స్పైడర్ మాన్ సినిమాను చూపించాడు. బంతిని అందుకోలేకపోయినప్పటికీ. సిక్సర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. చివరికి రెండు పరుగులు మాత్రమే వచ్చేలా చేశాడు. అక్షర్ పటేల్ ఫీల్డింగ్ చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. జాంటీ రోడ్స్ ఢిల్లీ జట్టు కెప్టెన్ గా అక్షర్ పటేల్ రూపంలో తిరిగి వచ్చాడని వ్యాఖ్యానిస్తున్నారు. అక్షర్ పటేల్ ఫీల్డింగ్ విన్యాసం గురించి వ్యాఖ్యాతలు కూడా పదేపదే ప్రస్తావించడం విశేషం. మరోవైపు అక్షర్ పటేల్ చేసిన ఫీలింగ్ ఆకట్టుకుందని.. ఢిల్లీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అతడు అలా ఫీల్డింగ్ చేయడం వల్లే చాలా వరకు పరుగులు ఆగిపోయాయని.. లేకుంటే ముంబై జట్టు ఇంకా ఎక్కువ స్కోరు చేసేదని వారు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
Watching this on looop
Athleticism at its best from Axar Patel to almost grab an absolute blinder
Updates ▶ https://t.co/sp4ar866UD#TATAIPL | #DCvMI | @DelhiCapitals | @akshar2026 pic.twitter.com/MiyniHeCMW
— IndianPremierLeague (@IPL) April 13, 2025