Tilak Verma : ఆదివారం ఢిల్లీ తో జరుగుతున్న మ్యాచ్ ముంబైకి అత్యంత ముఖ్యంగా మారింది. ఎప్పటిలాగే ఓపెనర్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. కాకపోతే ఈ మ్యాచ్లో 18 పరుగులు చేశాడు. రికెల్టన్ (41), సూర్య కుమార్ యాదవ్ (40), నమన్ ధీర్(38*) తమ వంతు ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (2) దారుణంగా విఫలమయ్యాడు. అయితే వీరందరి కంటే తెలుగోడు తిలక్ వర్మ (59) దుమ్ము రేపాడు. ఢిల్లీ జట్టు బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.. ఏ మాత్రం భయపడకుండా.. ఏమాత్రం వెరవకుండా బీభత్సమైన షాట్లు ఆడాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో కదం తొక్కాడు. సూర్య కుమార్ యాదవ్ తో మూడో వికెట్ కు 60, నమన్ ధీర్ తో కలిసి ఐదో వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫలితంగా ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. విప్రజ్ నిగమ్, కులదీప్ యాదవ్ చెరి రెండు వికెట్లు సాధించారు. ముఖేష్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
Also Read : గ్రీన్ కలర్ జెర్సీ లో బెంగళూరుకు తిరుగులేదంతే.. ఎన్ని విజయాలు సాధించిందంటే..
రెండు గేమ్స్ లో 115 పరుగులు..
ఈ సీజన్లో తిలక్ వర్మ ముంబై జట్టు నుంచి ఆరు మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు. తొలి నాలుగు మ్యాచ్ లలో అతడు 84 బంతుల్లో బంతుల్లో 95 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 113.1.. ఇక చివరి రెండు మ్యాచ్లలో తిలక్ వర్మ 62 బంతుల్లో 115 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 185.5. ఇటీవల ఓ మ్యాచ్లో భారీ షాట్లు ఆడలేక పోతున్నాడని.. తిలక్ వర్మను హార్దిక్ పాండ్యా రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పంపించాడు. కానీ అతడే ఈ మ్యాచ్లో రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఏ సాకు చూపించి తిలక్ వర్మను బయటికి పంపించాడో.. ఆదివారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో అతడే కీలకంగా మారాడు. ఢిల్లీ గడ్డపై తెలుగువాడి సత్తా చూపించాడు.. ఏకంగా 59 పరుగులు చేశాడు. తద్వారా తను ఎంత ప్రమాదకరమైన ఆటగాడినో అటు ఢిల్లీ జట్టుకు.. ఇటు హార్దిక్ పాండ్యా కు తిలక్ వర్మ తన బ్యాట్ ద్వారానే చెప్పాడు. ” గొప్పగా ఆడ లేడని అన్నారు. భారీగా షాట్లు ఆడటం లేదని ఆరోపించారు. రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పంపించారు. కానీ నేడు అతడు ముంబై జట్టుకు మొనగాడు అయ్యాడు. తెలుగోడు తన ధీరత్వాన్ని చూపించాడు. ఇప్పటికైనా హార్దిక్ లాంటి ఆటగాళ్లు కళ్ళు తెరవాలని” తిలక్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : రోహిత్ భయ్యా.. ఎందుకిలా.. ఎంత చెత్తగా ఆడుతున్నావో తెలుసా?