Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాశిలపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు వజ్రయోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి మహా శివుడి ఆశీస్సులు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో వాదనలే ఉంటాయి. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్లే సమస్యల పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలో వింటారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందేందుకు మార్గాలు ఏర్పడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారులకు కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త వ్యక్తుల వ్యాపార సలహాలు తీసుకోవద్దు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణం చేయాలని అనుకునే వారు వాయిదా వేసుకోవడమే మంచిది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనువైన సమయం కాదు. మీరు చేసే పనిలో కొన్ని నిరాశలు ఎదురు కావచ్చు. దూర ప్రయాణాల సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు లాభాలు వచ్చే అవకాశం ఉంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారికోసం కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు కెరీర్ పై దృష్టి పెట్టెందుకు సహకరించాలి. అదనంగా ఖర్చులు ఉంటాయి. ఆదాయం పెరిగిన ఆర్థిక ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాలను వాయిదా వేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో వాదన మంచిది కాదు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి ఆరోగ్య విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కారణాలవల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండలేరు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేవారు భవిష్యత్తులో లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య వాదనలకు దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు వ్యక్తుల వల్ల మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. అటువంటి వారి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి అనేక రంగాల్లో ఈరోజు సానుకూల ఫలితాలు ఉండానున్నాయి. వ్యాపారులు బిజీగా ఉంటారు. పెద్దల అనుగ్రహంతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన ప్రయాణాలు ఉంటాయి. వి లాభాలను తీసుకొస్తాయి. బంధువుల నుంచి రుణ సహాయం పొందుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో మాట్లాడే సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల నుంచి ధన సహాయం పొందుతారు. సోదరుల మద్దతుతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు సంబంధాల విషయంలో ఆందోళన చెందుతారు. వ్యక్తిగత విద్వేషాలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండాలి. ప్రియమైన వారితో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నం చేయాలి. పచ్చని పెరుగుతాయి. అయితే వాటిని చూసి భయపడకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గం వెతకాలి. మనసులో ప్రతికూల ఆలోచనలు రానీయకుండా చూడాలి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారులకు కొత్త కొత్త పెట్టుబడును కలిసి రావు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు వ్యక్తిగత జీవితం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందేందుకు మార్గాలు ఏర్పడతాయి. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటాయి. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు వెనుక ముందు ఆలోచించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి పెద్దల సహాయ తప్పనిసరి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలు ఉపయోగించుకోవద్దు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానమంత్రి పొందే అవకాశం.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు. వ్యాపార అవకాశాలు బాగుంటాయి. ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే వారికి లాభాలు ఉంటాయి. మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్యం పై పెద్ద వహించాలి. వ్యాపార పురోగతి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. రోజువారి పనులను పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో వ్యాపారం చేసేవారు అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఇంటికిలో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. బ్యాంకు నుంచి రుణ సహాయం పొందుతారు. సాధ్యమైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. వ్యక్తిగత విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆరోగ్య విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యాన్ని కొనసాగించద్దు. సొంత వాహనాల పై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణ ఏర్పడుతుంది. దూర ప్రాంతాల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు కొత్త ఆదాయాన్ని పొందుతారు. ఉద్యోగులు అవకాశాలను చేజిక్కించుకుంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు తెలివితేటలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో అధిక ప్రయోజనాలు పొందుతారు. లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది.