CM Chandrababu: తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన MLC అభ్యర్థుల జాబితా ని కాసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మీడియా కి విడుదల చేసాడు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంచుకునే ఈ ప్రక్రియ లో మొత్తం 5 మందికి MLC అయ్యే అవకాశం ఉంది. అందులో మొదటి అభ్యర్థి గా జనసేన పార్టీ నుండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సోదరుడు, కొణిదెల నాగబాబు(Konidela Nagababu) ఇటీవలే నామినేషన్ వేయగా, మరో స్థానాన్ని బీజేపీ అభ్యర్థికి ఇచ్చారు. ఇక మిగిలిన మూడు స్థానాల పై నేడు చంద్రబాబు ఉదయం నుండి తన ఆఫీస్ లో సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. మొత్తం 25 మంది ఆశావహులు ఉండగా, కేవలం ముగ్గురికి మాత్రమే ఆ అదృష్టం వరించింది. వాళ్లెవరో ఒకసారి వివరం గా చూద్దాము.
ఎస్సీ(మాల) సామజిక వర్గానికి చెందిన కావాలి గ్రీష్మ(Kavali Greeshma) కి MLC అభ్యర్థిగా నామినేషన్ వేసుకునే అవకాశం కల్పించాడు చంద్రబాబు. కావాలి గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కి స్పీకర్ గా వ్యవహరించింది. అదే విధంగా యాదవ సామజిక వర్గానికి చెందిన బీద రవిచంద్ర(Beeda Ravichandra) MLC అభ్యర్థిగా ప్రకటించగా, ఆ తర్వాత బోయ సామజిక వర్గానికి చెందిన బీటీ నాయుడు(BT Naidu) కు MLC అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. కాసేపటి క్రితమే ఈ ముగ్గురికి ఫోన్ చేసిన చంద్రబాబు, రేపు నామినేషన్స్ వేయాల్సిందిగా ఆదేశించాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే గా పోటీ చేసే స్థానాన్ని వదులుకున్న SVSN వర్మ, ఈసారి తన పేరు కచ్చితంగా MLC లిస్ట్ లో ఉంటుందని ఆశించాడు. కానీ ఆయన పేరు లేకపోవడం గమనార్హం. నిన్న మొన్నటి వరకు మీడియా ముందు తన పేరు కచ్చితంగా ఈసారి MLC జాబితాలో ఉంటుందని బలమైన నమ్మకంతో చెప్పుకొచ్చాడు వర్మ. కానీ ఇప్పుడు లేకపోవడం తో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.