Allu Arjun: ‘పుష్ప 2′(Pushpa 2 Movie) తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. మొదట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో మన పురాణాలకు సంబంధించి స్టోరీ తో సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వినిపించాయి. ఉగాది నుండే ఈ సినిమా మొదలు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పట్లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు లేవని స్వయంగా ఆ చిత్ర నిర్మాత నాగ వంశీ ఒక ప్రెస్ మీట్ లో విలేఖరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కంటే ముందు తమిళ దర్శకుడు అట్లీ తో అల్లు అర్జున్ సినిమాని ప్రారంభించనున్నాడని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చాలా గట్టిగా వినిపిస్తున్న వార్త. ఈమేరకు స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేసేసాడట అట్లీ. అయితే ఈ సినిమా ఒక క్రేజీ మల్టీస్టార్రర్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ కథని ముందుగా సల్మాన్ ఖాన్(Salman Khan), రజినీకాంత్(Superstar Rajinikanth) కాంబినేషన్ లో తెరకెక్కించాలని అనుకున్నాడట డైరెక్టర్ అట్లీ. కానీ అల్లు అర్జున్ ఈ కథ కావాలని పట్టుబట్టడంతో, ఆయన షూటింగ్ కి సిద్ధంగా ఉండడంతో అల్లు అర్జున్ కి షిఫ్ట్ అయ్యిందని, సల్మాన్ ఖాన్ కూడా అందుకు ఓకే చెప్పి, ఆల్ ది బెస్ట్ అని అట్లీ తో చెప్పాడని లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియా లో నడుస్తున్న చర్చ. ఇప్పుడు అట్లీ తెరకెక్కించాలని అనుకున్న మల్టీస్టార్రర్ లో సల్మాన్ ఖాన్ కి బదులుగా అల్లు అర్జున్ వచ్చి చేరాడు. రజినీకాంత్ కూడా అల్లు అర్జున్ తో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం. ఇందులో రజినీకాంత్ అల్లు అర్జున్ కి తండ్రిగా కనిపిస్తాడని, ఆయన పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది.
ఇదే సినిమాలో శివ కార్తికేయన్(Sivakarthikeyan) కూడా నటించబోతున్నట్టు సమాచారం. రీసెంట్ గానే ‘అమరన్’ చిత్రంతో 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టిన శివ కార్తికేయన్, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడని వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ, కచ్చితంగా ఈ ముగ్గురి హీరోల కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం 3000 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ మన ఇండియన్ సినిమాకి ప్రారంభం అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. ఈ ఉగాది లోపు ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడట. షూటింగ్ ఈ ఏడాది లోనే మొదలు పెట్టి, ఈ ఏడాది లోనే పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.