New Zealand Vs India: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీర విహారం చేస్తున్నాడు. దుబాయ్ మైదానాన్ని షేక్ చేస్తున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో అదరగొడుతున్నాడు. న్యూజిలాండ్ విధించిన 252 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో రోహిత్ – గిల్ జోడి అదరగొడుతోంది. 18 ఓవర్లు టీమిండియా ఒక వికెట్ కూడా నష్టపోకుండా 103 పరుగులు చేసింది. రోహిత్ శర్మ ( 69*), గిల్(29*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
Dear haters
Look at my oversized (sixes)
Look at my heavyweight (achievements)
Look at my extra inches (on the bat’s sweet spot)
Look at my chubby (trophy cabinet)
Look at my huge appetite (to win for the country)
-Regards,
Rohit Gurunath Sharma pic.twitter.com/WMJDhIRda1— Sagar (@sagarcasm) March 9, 2025
ప్రస్తుతం జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నప్పటికీ గొప్ప ఇన్నింగ్స్ నిర్మించలేకపోతున్నాడు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్లు రోహిత్ శర్మ పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు..” రోహిత్ దూకుడుగా ఆడుతున్నాడు గాని.. అది జట్టుకు సరిపోడం లేదు. అతడు వేగంగా ఆడటం మీదనే దృష్టి సారిస్తున్నాడు. బలమైన ఇన్నింగ్స్ నిర్మించలేకపోతున్నాడు. దీనివల్ల జట్టు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ప్రత్యర్థి జట్టు చేతిలో ఒత్తిడి చవిచూస్తున్నది. అందువల్ల రోహిత్ దృఢంగా ఆడాలి. బలంగా ఆడాలి. అన్నింటికీ మించి 10 లోపే అవుట్ అవ్వడాన్ని విరమించుకోవాలని” వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు.. ఇది రోహిత్ శర్మ పై బలమైన ప్రభావాన్ని చూపించినట్టు కనిపిస్తోంది. అందువల్లే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై బలమైన ఇన్నింగ్స్ ఆడాడు.
How Rohit Sharma is seeing New Zealand players today#ChampionsTrophy2025#INDvsNZ pic.twitter.com/nxyooJeeGm
— Raja Babu (@GaurangBhardwa1) March 9, 2025
ఆటాడుకుంటున్న నెటిజన్లు
ఇటీవల రోహిత్ శర్మ పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ” రోహిత్ పూర్తిస్థాయిలో శరీర సామర్థ్యాన్ని కలిగి ఉండడు. అతడు లావుగా ఉంటాడు. కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని లాగా కనిపించడు. పైగా వేగంగా పరుగులు తీయడంలో ఇబ్బంది పడతాడు. రోహిత్ లావుగా ఉంటాడని” షామా మహమ్మద్ వ్యాఖ్యానించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించాయి. దీనిపై జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో.. సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. అయితే ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో షామా మహమ్మద్ పై రోహిత్ అభిమానులు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. “షామా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు బలమైన ప్రభావాన్ని చూపించాయి. అందువల్లే రోహిత్ ఆ స్థాయిలో ఆడుతున్నాడని” వారు వ్యాఖ్యానిస్తున్నారు. “రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు అంత లావుగా ఉన్నప్పటికీ ఆడుతున్నాడు. కొంతమంది ఏవేవో విమర్శలు చేశారు. అయినప్పటికీ అతడు దేశం కోసం మాత్రమే ఆడుతున్నాడు అతడి ఆటను ప్రపంచం మొత్తం ఆస్వాదిస్తోంది ఇలాంటి సమయంలో కొంతమంది చెవులు మూసుకోవాలి. కళ్ళు కూడా మూసుకోవాలి. రోహిత్ అంటే ఏంటో తెలియని వారు విమర్శలు చేస్తే.. ఎంతటి స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందో వారికి తెలిసింది. ఇకపై అలాంటి విమర్శలు చేయకుండా ఉండడం మంచిదని” రోహిత్ అభిమానులు పేర్కొంటున్నారు.
Rohit Sharma takes to the skies early on in the powerplay ✈️
Catch the Final Live in India on @StarSportsIndia.
Here are the global broadcast details: https://t.co/S0poKnxpTX#ChampionsTrophy #INDvNZ pic.twitter.com/5yiwmpr9dO
— ICC (@ICC) March 9, 2025