Naga Chaitanya New Movie: ప్రస్తుతం అక్కినేని అభిమానుల ఆశలన్నీ నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) మీదనే ఉన్నాయి. గత కొన్నేళ్ల నుండి అక్కినేని లేజసీ ని నాగ చైతన్య మాత్రమే మోస్తున్నాడు. నాగార్జున వరుస ఫ్లాప్స్ తో తన మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు, అఖిల్ ఇంకా రీ రీ లాంచ్ అవుతూనే ఉన్నాడు కానీ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఇలాంటి సమయం లో అక్కినేని అభిమానులు మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కూడా సంతృప్తి పరిచే సినిమాలను చేస్తున్న ఏకైక అక్కినేని హీరో గా నాగ చైతన్య పేరు తెచ్చుకున్నాడు. ‘తండేల్’ చిత్రం తో అక్కినేని ఫ్యామిలీ కి మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ సినిమాని అందించిన నాగ చైతన్య , ఇప్పుడు ‘వృష కర్మ’ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?
విరూపాక్ష లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ కారణం చేత విపరీతమైన హైప్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఆ హైప్ కి తగ్గట్టే టీజర్ కూడా ఉండడం తో ఈ చిత్రం తో ఈసారి నాగ చైతన్య 200 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేలా ఉన్నాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రం తర్వాత నాగ చైతన్య చెయ్యబోయే సినిమా కూడా ఖరారు అయిపోయింది. తనతో గతంలో ‘లవ్ స్టోరీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శేఖర్ కమ్ముల తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు నాగ చైతన్య. రీసెంట్ గానే ఆయన్ని కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించగా, అది నాగ చైతన్య కి తెగ నచ్చేసింది. మళ్లీ మన కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఎంత గ్రాండ్ గా ఉండాలని అనుకున్నామో, అంతకు మించి ఈ స్టోరీ ఉందని అన్నాడట నాగ చైతన్య.
ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ చివరి దశలో ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం కాబోతుంది. అయితే ఈసారి వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఏ జానర్ లో ఉండబోతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. సున్నితమైన అసమాలతో సినిమాలు తీసే శేఖర్ కమ్ముల, ఒక్కసారిగా కుబేర లాంటి సినిమా చేయడం తో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. శేఖర్ కమ్ముల లో ఇలాంటి కోణం కూడా దాగుందా ? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఈ చిత్రం. మళ్లీ తన ఇమేజ్ కి పూర్తి భిన్నమైన స్టోరీ తోనే రాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ఈ సినిమాని కూడా ఏషియన్ సునీల్ నిర్మించబోతున్నాడు అట.
