Chennai : ఇంతటి ఘనతలు ఉన్న చెన్నై జట్టు ఈ సీజన్ లో మాత్రం అత్యంత దారుణమైన ఆటతీరుతో అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. బలమైన అభిమాన దళం ఉన్నప్పటికీ.. చెన్నై ప్లేయర్లు అత్యంత నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శిస్తూ విమర్శలు మూట కట్టుకుంటున్నది. ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్ నుంచి ఎప్పుడో వైదొలిగింది. ధోని లాంటి సారథి ఉన్నప్పటికీ చెన్నై జట్టు అనామకమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది.. విజయాల మాట అటు ఉంచితే.. కనీసం పోటీ కూడా చేయలేకపోతోంది. మంగళవారం రాజస్థాన్ తో తలపడి చెన్నై దారుణమైన పరాభవాన్ని చవిచూసింది. ఈ సీజన్లో పదవ ఓటమిని చవి చూసింది. అంతేకాదు 2022లో తన పేరు మీద ఉన్న అత్యంత చెత్త రికార్డును చెన్నై సమం చేసుకుంది. 2022 లోనూ చెన్నై జట్టు పది మ్యాచ్లలో ఓడిపోయింది. ఇక 2012, 2020లో 8 మ్యాచ్లలో ఓటమిపాలైంది. చెన్నై జట్టు 2023లో విజేతగా ఆవిర్భవించింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన చివరి మ్యాచ్లో గుజరాత్ జట్టును మట్టి కరిపించింది. ఆ తర్వాత ఆ స్థాయిలో చెన్నై ఆటతీరు ప్రదర్శించలేకపోతోంది..
రాజస్థాన్ తో మంగళవారం నాడు తలపడి.. చెన్నై అత్యంత దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 187 రన్స్ స్కోర్ చేసింది . ప్రారంభంలో వికెట్లను వెంట వెంటనే కోల్పోయిన చెన్నై.. తర్వాత కాస్త కుదురుకున్నప్పటికీ.. రాజస్థాన్ ముందు ఆ టార్గెట్ సరిపోలేదు. పైగా ధోని అత్యంత దారుణంగా జిడ్డు బ్యాటింగ్ చేశాడు. 17 బంతులు ఎదుర్కొని 16 పరుగులు మాత్రమే చేశాడు. ఇక చెన్నై విధించిన టార్గెట్ ను 17.1 ఓవర్లలో పరాగ్ సేన ఫినిష్ చేసింది. వైభవ్ సూర్య వంశీ 4 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. రాజస్థాన్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. రాజస్థాన్ జట్టు విజయం సాధించినప్పటికీ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇక చెన్నై జట్టు చివరి స్థానంలో కొనసాగుతోంది.
Also Read : చివరి రెండు ఓవర్లలో.. ఇంత విధ్వంసమా.. చెన్నై బౌలర్లకు ఏడుపొకటే తక్కువ
వాస్తవానికి చెన్నై ఇలా ఆడుతుందని ఏ అభిమాని కూడా ఊహించి ఉండడు. ఇంతటి దారుణమైన ఆట తీరును చూసి చెన్నై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..” గొప్పగా ఆడుతుంది అనుకున్నాం. ఈసారి ట్రోఫీ ఎలాగైనా సాధిస్తుందని అనుకున్నాం. కానీ మా అంచనాలను ఆటగాళ్లు చేరుకోలేకపోయారు. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ఏం జరిగిందో అర్థం కావడం లేదు. మాకు ధోని మీద విపరీతమైన నమ్మకం ఉండేది. కానీ అతడి ఆధ్వర్యంలో కూడా చెన్నై జట్టు ఇలా ఆడటం చూస్తుంటే బాధ కలుగుతోందని” అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
ఇక చెన్నై జట్టు ఆట తీరుపై ధోని గతంలోనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్లేయర్లలో క్రీడా స్ఫూర్తి లేదని వాపోయాడు. ఇలాంటి ప్లేయర్లతో మ్యాచులు గెలవడం కష్టమని ఆవేదన వ్యక్తం చేశాడు. గొప్పగా పరుగులు చేస్తారని అనుకుంటే.. చెత్త ఆటను ప్రదర్శిస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి ప్లేయర్లను నమ్ముకొని సిరీస్ లు గెలవడం చాలా కష్టమని ధోని అభిప్రాయపడ్డాడు. అప్పట్లో ధోని చెన్నై జట్టు ప్లేయర్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ధోని అలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ చెన్నై జట్టు ఆట తీరు ఏమాత్రం మారకపోవడం విశేషం. చివరికి రాజస్థాన్ చేతిలో కూడా అత్యంత దారుణమైన ఓటమిని ఎదుర్కోవడం గమనార్హం.