RCB VS CSK : ఒకే ఓవర్ లో.. అది కూడా చివరిదైన 19 ఓవర్లో 33 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ లో తొలి బంతిని రోమారియో షెఫర్డ్ సిక్సర్ కొట్టాడు. రెండవ బంతిని కూడా సిక్సర్ బాదాడు. మూడవ బంతిని ఫోర్ గా మలిచాడు. నాలుగో బంతిని సిక్సర్ కొట్టాడు. ఐదో బంతి నో బాల్ అయినప్పటికీ.. షెఫర్డ్ ఊరుకోలేదు. దానిని కూడా సిక్సర్ గా కొట్టాడు. అయితే ఫ్రీ హిట్ బంతిని ఖలీల్ అహ్మద్ తెలివిగా వేయడంతో.. షెఫర్డ్ దానిని డిఫెన్స్ చేయాల్సి వచ్చింది. ఇక చివరి బంతిని షెఫర్డ్ ఫోర్ కొట్టాడు. మొత్తంగా ఈ ఓవర్ లో ఖలీల్ అహ్మద్ 33 పరుగు సమర్పించుకున్నాడు.
Also Read : 17 ఏళ్ల పోరడు.. చెన్నై జట్టుకు “ఆయుష్” పోశాడు..
చివరి ఓవర్లలో బెంగళూరు అరాచకం
చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో చివరి రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది ఒక రికార్డు. 2024లో గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. 2020 దుబాయ్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. 2019లో బెంగళూరు వేదికగా పంజబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది.
చెన్నై బౌలర్ల దయనీయం
ఖలీల్ అహ్మద్ 19 ఓవర్ వేసి 33 పరుగు సమర్పించుకోవడమే కాదు.. మొత్తంగా మూడు ఓవర్లు వేసి 65 పరుగులు ధారాళంగా ఇచ్చేశాడు. అతని బౌలింగ్లో బెంగళూరు ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. తద్వారా అతని ఎకానమీని ఏకంగా 21.70కి పెంచారు. అతడే దారుణంగా బౌలింగ్ చేశాడు అంటే.. చివరి ఓవర్ లో మతీష పతిరణ 21 పరుగులు సమర్పించుకోవడం విశేషం. షెఫర్డ్ బౌలింగ్లో వరుసగా నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టడం విశేషం. అన్నట్టు గత సీజన్లో హైదరాబాద్ బెంగళూరు పై భీకరంగా బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో.. బౌలర్లను దేవుడే కాపాడాలి అని రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ఇప్పుడు అదే చెన్నై జట్టు తరఫున ఆడుతున్న అతడు.. తమ జట్టు బౌలర్లు చెత్తగా బౌలింగ్ వేస్తుండడాన్ని చూసి.. గత సీజన్లో తను చేసిన ట్వీట్ ను గుర్తుకు తెచ్చుకుంటాడని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చెన్నై బౌలర్లు ఇంత దయనీయంగా బౌలింగ్ వేయడాన్ని తాము చూడలేకపోతున్నామని క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు అంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.