Venkatesh and Trivikram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivkram Srinivas)…ఆ తర్వాత ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాలు తెలుగు ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ఉండడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన ప్రతి సినిమాని మంచి విజయంగా మారుస్తూ వచ్చాడు. అల్లు అర్జున్ (Allu Arjun) తో సినిమా చేయాల్సిన త్రివిక్రమ్ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు వెంకటేష్ తో ఒక కామెడీ ఎంటర్ టైనర్ ను చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తొందరలోనే ఈ సినిమా ముహూర్తం కూడా జరుపుకోబోతుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అంటూ ప్రేక్షకులు ఇప్పటినుంచే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. మరి ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇవ్వడం అతని అభిమానులను ఇబ్బంది పెడుతుందా..?
ఇంతకు ముందే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. కాబట్టి ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) సైతం తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇప్పుడున్న పొజిషన్లో ఆయన మంచి సక్సెస్ ని సాధించి ముందుకు దూసుకెళ్తే తప్ప భారీ విజయాన్ని సాధించడం అనేది అసాధ్యం అనే చెప్పాలి…కాబట్టి కొత్త కథతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. గుంటూరు కారం సినిమాతో భారీగా తన ఇమేజ్ ను డామేజ్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
‘గుంటూరు కారం’ (Gunturu Kaaram) సినిమా వచ్చి రెండు సంవత్సరాల పైనే అవుతున్నప్పటికి ఆయన ఇప్పటివరకు మరొక సినిమాను స్టార్ట్ చేయలేదు. స్క్రిప్ట్ మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఈ సినిమాని స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో వెంకటేష్ ఈ సినిమాని మొదలు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్ 2’ చేయబోతున్నారా..?