Chandrakant Pandit: లీగ్ దశలో నెంబర్ వన్.. ప్లే ఆఫ్ లోనూ అదే తీరు.. ఫైనల్ లోనూ అదే తరహా జోరు.. ఆట తీరు మ్యాచ్ మ్యాచ్ కు మారింది. బౌలింగ్ మరింత మెరుగయింది… బ్యాటింగ్ సరికొత్త లయను అందుకుంది. అసలు ఈ స్థాయిలో కోల్ కతా ఎలా మారింది.. మూడోసారి ఛాంపియన్ గా ఎలా అవతరించింది.. ఇంతటి ఘనత వెనుక ఉన్నది.. ఒకే ఒక వ్యక్తి.. అతడే చంద్రకాంత్ పండిట్..
గౌతమ్ గంభీర్(Gautam Gambhir) వల్ల చంద్రకాంత్ పండిట్ పెద్దగా వెలుగులోకి రాలేదు కానీ.. అతడి ఘనత తెలిస్తే నోరు వెళ్ళబెటాల్సిందే. ఎలాంటి జట్టునైనా సరే ఆయన విజేతగా మలచగలడు. హేమా హేమీలాంటి ఆటగాళ్లు లేకున్నా సరే.. జట్టును గెలుపు గుర్రం లాగా పరుగులు పెట్టించగలడు. దీనికి చంద్రకాంత్ ఇచ్చే సాధన.. నేర్పే పాఠం ఒక్కటే. అదే సమష్టితత్వం.. కలిసికట్టుగా ఆడితే చాలు కచ్చితంగా గెలుస్తామని చెబుతారు చంద్రకాంత్ పండిట్.. దేశవాళీ క్రికెట్ లో ముంబై జట్టుకు ప్రధాన శిక్షకుడిగా చంద్రకాంత్ పండిట్ వ్యవహరించారు. మూడుసార్లు రంజీ ట్రోఫీలు అందించారు. విదర్భ జట్టుకు సైతం రెండుసార్లు రంజి ట్రోఫీలు అందించారు. అనామక మధ్యప్రదేశ్ జట్టుకు సైతం రంజీ టైటిల్ దక్కేలా చేశారు. 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కోల్ కతా ఐపీఎల్(IPL) విజేతగా ఆవిర్భవించడంలో చంద్రకాంత్ కీలకపాత్ర పోషించారు..
ఈ సీజన్లో కోల్ కతా అదిరిపోయే ఆట తీరు ప్రదర్శించింది. అద్భుతమైన బ్యాటింగ్.. అంతకు మించిన బౌలింగ్ తో ఆకట్టుకుంది. ప్రత్యర్థులపై పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ సీజన్ కు ముందు గౌతమ్ గంభీర్ మెంటార్ గా రావడం కోల్ కతా జట్టుకు కలిసి వచ్చింది. లక్నో జట్టుకు మెంటార్ గా ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్ ఆ జట్టును రెండుసార్లు ప్లే ఆఫ్ కు చేర్చాడు.. ఈసారి కోల్ కతా కు మెంటార్ గా మారాడు. ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. గౌతమ్ గంభీర్ తో పాటు హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్, బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ కోల్ కతా జట్టుపై తీవ్ర ప్రభావం చూపించారు.
చంద్రకాంత్ పండిట్ భారత మాజీ క్రికెటర్ కూడా. 1986 -1992 మధ్యకాలంలో ఆయన టీమిండియా తరఫున ఐదు టెస్టులు, 36 వన్డే మ్యాచ్లు ఆడాడు. 1987 వరల్డ్ కప్ టీమ్ ఇండియా లో ఆయన కీలక సభ్యుడిగా ఉన్నారు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత ఆయన అకాడమీది ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలానికి ముంబై రంజీ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించారు. 2003, 2004, 2016 సంవత్సరాలలో ముంబై జట్టు రంజి ట్రోఫీలు గెలవడంలో ముఖ్యపాత్ర పోషించారు. ముంబై జట్టు తర్వాత విదర్భకు ఆయన హెడ్ కోచ్ గా వెళ్లారు. 2018, 2019 సంవత్సరాలలో వరుసగా రెండుసార్లు ఆ జట్టు రంజి ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. మధ్యప్రదేశ్ జట్టుకు కోచ్ గా వెళ్లిన చంద్రకాంత్ పండిట్ 2022 లో ఆ జట్టును రంజీ విజేతగా నిలిపారు. అదే సంవత్సరం లో కోల్ కతా జట్టు ఆయనను కోచ్ గా నియమించింది. రెండు సంవత్సరాల లోనే ఆయన కోల్ కతా జట్టును(Kolkata Knight Riders) ఐపీఎల్ విజేతగా నిలిపారు.. చంద్రకాంత్ పండిట్ తర్వాత ఆ జట్టు అసిస్టెంట్ కోచ్, బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్..కోల్ కతా ఆటగాళ్ల బ్యాటింగ్ సరళిని పూర్తిగా మార్చేశారు. రింకూ సింగ్ లాంటి ఎంతో మంది ఆటగాళ్లకు అద్భుతమైన శిక్షణ ఇచ్చి, భవిష్యత్తు ఆశా కిరణాలు లాగా తయారు చేశారు.
IPL 2024 – RCB : ఆర్సీబీ డ్రెస్సిగ్ రూమ్ దృశ్యాలు.. చూస్తే కళ్లు చెమర్చుతాయి!
IPL 2024 – RCB : 14 కోట్లు పెట్టుకుంటే.. సున్నా చుట్టి వస్తావా.. కొంచమైనా ఉండాలి..