Champions Trophy: పాక్ వేదికగా 29 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. మొత్తం ఈ ట్రోఫీలో 8 జట్లు పాల్గొన్నాయి. ఆదివారంతో లీగ్ సమరం ముగుస్తోంది. గ్రూప్ – ఏ లో మొదటి, రెండు స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, భారత్ ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడతాయి. ఇప్పటికే సెమీఫైనల్ లోకి గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా వెళ్లాయి.
Also Read: నా తమ్ముడి ఇంటి జనరేటర్ లో పంచదార పోయడానికి కారణం అదే : మంచు విష్ణు
భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఒకవేళ ఇండియా గెలిస్తే గ్రూప్ – ఏ లో మొదటి స్థానంలో ఉంటుంది. అప్పుడు గ్రూప్ – బీ లో రెండవ స్థానంలో ఉన్న జట్టుతో భారత్ ఆడుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా – ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికా విజయపథంలో సాగుతోంది. ఒకవేళ దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే గ్రూప్ బీ లో నెంబర్ వన్ గా ఉంటుంది. అప్పుడు భారత్ ఆస్ట్రేలియా తో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా కనుక అనూహ్యంగా ఓడిపోతే.. అప్పుడు ఆస్ట్రేలియా మొదటి స్థానంలోకి వస్తుంది. భారత్ సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆదివారం జరిగే మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే.. గ్రూప్ బి లో రెండవ స్థానంలో నిలిచిన జట్టుతో తలపడాల్సి ఉంటుంది. గ్రూప్ బి లో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచే అవకాశం ఉంది కాబట్టి.. ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ ఉంటుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే.. అప్పుడు న్యూజిలాండ్ గ్రూప్ బి లో రెండవ స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా తో పోటీ పడాల్సి ఉంటుంది.
మూడు మ్యాచ్లు రద్దు కావడం వల్ల..
చాంపియన్స్ ట్రోఫీలో ఈసారి ఏకంగా మూడు మ్యాచ్లు రద్దయ్యాయి. దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. టాస్ కూడా వేసే పరిస్థితి లేకపోవడంతో రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇక పాకిస్తాన్ – బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయింది. ఆఫ్ఘనిస్తాన్ – ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయింది. దీంతో నిర్వాహకులు రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించడంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్ వెళ్ళింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 273 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. 274 పరుగుల విజయలక్ష్యం తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. అప్పటికి వర్షం కురవడం.. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ నిర్వహణకు ముందుకు రాలేదు. దీంతో రెండు జట్లకు ఎంపైర్లు చెరో కేటాయించారు. ఆఫ్ఘనిస్తాన్ పై ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ 40 బంతుల్లో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరో ఆటగాడు మాథ్యూ షార్ట్ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అజ్మతుల్లా బౌలింగ్లో అతడు క్యాచ్ అవుట్ అయ్యాడు. స్టీవెన్ స్మిత్ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఈ ట్రోఫీలో ఇప్పటివరకు భారత్ స్థిరమైన ప్రదర్శన చేస్తోంది. 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ వెళ్ళింది. ఫైనల్ పోరులో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పటికీ.. భారత్ అదే ఆట తీరు ప్రదర్శిస్తోంది. 2017లో ఓడించిన పాకిస్తాన్ జట్టును.. ఈసారి లీక్ దశలో ఆరు వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది. నాటి ఓటమికి బదులు తీర్చుకుంది.
Also Read: రాజశేఖర్, శంకర్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేవాడు