Manchu Vishnu: మోహన్ బాబు(Manchu Mohan Babu) పెద్ద తనయుడు మంచు విష్ణు(Manchu Vishnu) తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల మూవీ టీం విడుదల చేసింది. ఈ టీజర్ కి నెటిజెన్స్ నుండి భిన్నమైన కామెంట్స్ వినిపించాయి. మంచు సినిమా అంటే సోషల్ మీడియా లో ట్రోల్స్ సర్వసాధారణం. అదే విధంగా ఈ టీజర్ కి కూడా అలాంటి ట్రోల్స్ ఎదురయ్యాయి. అయితే ఇప్పటి వరకు రెండు టీజర్స్ ని విడుదల చేసారు, ఈ రెండు కూడా మార్కెట్ లో ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. కానీ మొదటి పాటకు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందరి హీరోల అభిమానులు ఈ పాటని తెగ మెచ్చుకున్నారు. కానీ ఈరోజు విడుదల చేసిన టీజర్ కి మాత్రం ట్రోల్స్ మామూలుగా లేవు. నేడు టీజర్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ప్రెస్ మీట్ లో విష్ణు మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
Also Read: ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ భోర్సే..రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గత రెండు నెలలుగా మంచు కుటుంబం లో గొడవలు ఏ రేంజ్ ఉన్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాము. మోహన్ బాబు చిన్న తనయుడు మంచు మనోజ్(Manchu Manoj) తనకు రావాల్సిన ఆస్తులపై మోహన్ బాబు, విష్ణు లపై పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ పోరాటం లో ఆయన విజయం సాదిస్తాడో లేదో పక్కన పెడితే వీళ్ళ మధ్య జరిగే గొడవలు మాత్రం చూసే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది. ప్రేక్షకులకు విపరీతంగా నవ్వు తెప్పించిన సంఘటన ఏదైనా ఉందా అంటే, మంచు విష్ణు మనోజ్ ఇంట్లో ఉన్న జనరేటర్ లో పంచదార పోయడం. అందుకు సంబంధించిన సీసీటీవీ కెమెరా వీడియోని మనోజ్ పోలీసులకు అందించి , సోషల్ మీడియా లో విడుదల చేయగా అది బాగా వైరల్ అయ్యింది. దీని ఎన్నో ఫన్నీ మీమ్స్ కూడా వచ్చాయి.
నేడు జరిగిన ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి ఈ పంచదార జనరేటర్ లో కలిపే సంఘటన గురించి మనోజ్ ని అడుగుతాడు. అప్పుడు ఆయన దానికి సమాధానం చెప్తూ ‘ఇంధనం లో పంచదార కలిపిన తర్వాత మైలేజ్ వస్తుందని ఎవరో వాట్సాప్ లో పంపితే చదివాను. అందుకే మనోజ్ ఇంటి జనరేటర్ లో పంచదార కలిపాను’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇకపోతే నేడు విడుదలైన టీజర్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) తో పాటు మోహన్ లాల్(Mohanlal), రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) వంటి వారు కూడా కనిపించారు. కేవలం వీళ్ళ వల్లే ఈ సినిమాకి ప్రత్యేకమైన క్రేజ్ వచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ చిత్రం విష్ణు కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తుందా?, లేదా ఫ్లాప్ అవుతుందా అనేది చూడాలి.