Rajasekhar And Shankar: సీనియర్ హీరోలలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకొని, స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగిన నటుడు రాజశేఖర్(Rajashekar). డాక్టర్ వృత్తిలో గొప్ప రాణిస్తున్న సమయంలోనే సినిమాల మీద ఇష్టంతో, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన, కెరీర్ ప్రారంభం లో విలన్ రోల్స్, క్యారక్టర్ రోల్స్ ద్వారానే పాపులారిటీ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి అంకుశం, ఆవేశం, మగాడు, అల్లరి ప్రియుడు, ఆహుతి ఇలా ఒక్కటా రెండా, ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో హీరో గా నటించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అప్పట్లో ఈయన సినిమాలకు చిరంజీవి(Megastar Chiranjeevi), బాలకృష్ణ(Nandamuri Balakrishna) లాంటి స్టార్ హీరోలతో సమానంగా ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవట. మాస్ లో వాళ్ళిద్దరికీ ఉన్నంత ఫ్యాన్ బేస్ ఇతనికి కూడా ఉండేదట. కానీ 2000 దశాబ్దం ప్రారంభం కాగానే, కొత్త హీరోల దాటికి రాజశేఖర్ క్రేజ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది.
Also Read: నా తమ్ముడి ఇంటి జనరేటర్ లో పంచదార పోయడానికి కారణం అదే : మంచు విష్ణు
2010 తర్వాత అయితే ఆయన హీరోగా పూర్తి స్థాయిలో మార్కెట్ ని పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే రాజశేఖర్ కేవలం ఒక్క సినిమాని ఒప్పుకొని చేసి ఉండుంటే ఈరోజు పాన్ ఇండియన్ స్టార్ గా ఉండేవాడని అంటున్నారు ట్రేడ్ పండితులు. అప్పట్లో సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రాజశేఖర్(Shankar Shanmugham) తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడట. ఆ సినిమా మరేదో కాదు, ‘జెంటిల్ మ్యాన్’. ఈ చిత్రం ద్వారానే శంకర్ డైరెక్టర్ గా మారాడు. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక ప్రభంజనం. తమిళం లో మాత్రమే కాకుండా, తెలుగు లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు మెగాస్టార్ చిరంజీవి హిందీ లో రీమేక్ చేసాడు. ఈ చిత్రం కథకి రాజశేఖర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాడని, ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ కి సరితూగే సినిమా అని శంకర్ అప్పట్లో బలంగా నమ్మాడట.
ఈ స్టోరీ ని రాజశేఖర్ కి వినిపించగానే ఆయనకు ఎంతో నచ్చింది. కానీ అప్పటికే ఆయన అల్లరి ప్రియుడు సినిమా కోసం రాఘవేంద్ర రావు కి బల్క్ గా డేట్స్ ని కేటాయించాడు. మరో సినిమాకి డేట్స్ ఇవ్వలేని పరిస్థితికి ఉండడంతో రాజశేఖర్ కొద్దిరోజులు ఆగగలరా అని శంకర్ ని రిక్వెస్ట్ చేసాడట. కానీ శంకర్ అందుకు ఒప్పుకోలేదు. రాజశేఖర్ డేట్స్ ఇస్తాడేమో అని అనేక సార్లు ఆయన ఇంటి చుట్టూ చెక్ పట్టుకొని తిరిగాడట. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమా చేయలేనని చెప్పాడట రాజశేఖర్. దీంతో అదే సినిమాని యాక్షన్ కింగ్ అర్జున్ తో చేసి సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు శంకర్. ఒకవేళ ఇదే సినిమాని రాజశేఖర్ ఆరోజుల్లో చేసి ఉండుంటే, ఆయన చిరంజీవి, బాలకృష్ణ వంటి వారిని మించే రేంజ్ స్టార్ అయ్యేవాడేమో, బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.