https://oktelugu.com/

Manchu Family: మొన్న నాగార్జున..నేడు మోహన్ బాబు..టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ పై మండిపడుతున్న కార్యకర్తలు!

రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టడానికి ఇంతలా శ్రమిస్తుంటే, ఆ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగు దేశం పార్టీ కి ద్రోహం చేయాలని చూస్తున్నారా..?

Written By: , Updated On : March 1, 2025 / 07:51 PM IST
Manchu Family

Manchu Family

Follow us on

Manchu Family: కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా పరుగులు పెడుతున్నాయో మన కళ్లారా చూస్తున్నాము. 70 ఏళ్లుగా రోడ్లు చూడని గ్రామాన్ని సిమెంట్ రోడ్లను చూస్తున్నాయి, విద్యుత్తు సౌకర్యం లేకుండా దశాబ్దాల తరబడి చీకట్లో మగ్గిపోయిన గ్రామాలూ కొత్త వెలుగులు చూస్తున్నాయి, ఇచ్చిన మాట ప్రకారం అధికారం లోకి వచ్చిన వెంటనే 4 వేల రూపాయిల పెన్షన్ పెంచడం, వికలాంగులకు పెన్షన్ డబుల్ చేసి ఇవ్వడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడడం, విశాఖ పట్నం రైల్వే జోన్ రావడం, పోలవరం, అమరావతి నిధులు రావడం, ఇలా ఒక్కటా రెండా 8 నెలల్లో ఎన్నో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే నెల నుండి సూపర్ 6 లో ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీలు తల్లికి వందనం, రైతు భరోసా వంటివి కూడా అమలు చేయబోతున్నారు.

Also Read: నా తమ్ముడి ఇంటి జనరేటర్ లో పంచదార పోయడానికి కారణం అదే : మంచు విష్ణు

రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టడానికి ఇంతలా శ్రమిస్తుంటే, ఆ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగు దేశం పార్టీ కి ద్రోహం చేయాలని చూస్తున్నారా..?, ప్రత్యర్థి పార్టీ వైసీపీ కి అత్యంత సన్నిహితంగా ఉండే ప్రముఖులకు ఎందుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు?, అసలు తెలుగు దేశం పార్టీ లో ఏమి జరుగుతుంది అంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఉదాహరణలు కూడా లేకపోలేదు. మాజీ సీఎం జగన్ కి, వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అక్కినేని నాగార్జున కి., టీడీపీ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి లావు శ్రీ కృష్ణ దేవరాయలు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం తెలుగు తమ్ముళ్లకు అసలు నచ్చలేదు. రీసెంట్ గానే అక్కినేని ఫ్యామిలీ మొత్తం ప్రధాన మంత్రి తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అలా ప్రధానమంత్రి తో అక్కినేని ఫ్యామిలీ ని కలిపించిన వ్యక్తి లావు శ్రీకృష్ణ దేవరాయలునే అట.

వైసీపీ పార్టీ నుండి సరిగ్గా ఎన్నికల సమయంలో టీడీపీ లోకి వచ్చిన లావు, ఏకంగా కేంద్ర క్యాబినెట్ లో చోటు కల్పించేలా చేసాడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తికి విధేయులుగా ఉండాలి కానీ, ఇలా శత్రువుల సన్నిహితులకు మేలు చేసేలా ఉండకూడదని మండిపడుతున్నారు. కేవలం నాగార్జున విషయం లోనే కాదు, మంచు మోహన్ బాబు విషయం లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రీసెంట్ గా శ్రీకాళహస్తి లో జరిగిన బ్రహ్మోత్సవాలకు, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మంచు కుటుంబానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. దగ్గరుండి వాళ్ళని గర్భగుడి లోపలకు తీసుకెళ్లి, ప్రత్యేకమైన పూజలు జరిపించాడు. మోహన్ బాబు చంద్రబాబు నాయుడు కి భద్ర శత్రువు అనే విషయం అందరికీ తెలిసిందే. వై ఎస్ కుటుంబానికి వియంకుడు, అంతే కాకుండా 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ కి సపోర్టుగా ప్రచారం చేస్తూ టీడీపీ పై దుమ్మెత్తిపోశాడు. అలాంటి వ్యక్తికి సుధీర్ రెడ్డి ప్రత్యేకమైన ఆతిధ్యం ఇవ్వడమేంటి?, అసలు ఏమి జరుగుతుంది మన పార్టీ లో అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితిలో ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని, ఇలాంటోళ్ళు పార్టీ లో చాలా మంది ఉన్నారని, ప్లీనరీ సమావేశాలు మొదలయ్యే లోపు వీళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాలని సోషల్ మీడియా లో కార్యకర్తలు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ని ట్యాగ్ చేసి కోరుతున్నారు.

Also Read: రాజశేఖర్, శంకర్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేవాడు!