NZ vs SA : ఇటీవల పాకిస్తాన్ వేదికగా ట్రై సిరీస్ జరిగింది. ఆ సిరీస్ లో సాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బలమైన దక్షిణాఫ్రికా జట్టును, సొంత మైదానంలో ఆడుతున్న పాకిస్తాన్ జట్టును (రెండుసార్లు) ఓడించాడు. తద్వారా ట్రై సిరీస్ న్యూజిలాండ్ జట్టుకు దక్కేలాగా చేశాడు. అంతకంటే ముందు భారత్ వేదికగా టీమిండియాతో న్యూజిలాండ్ మూడు టెస్టులు ఆడింది. ఈ సిరీస్ కంటే ముందు న్యూజిలాండ్ శ్రీలంక జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడగా ఓటమిపాలైంది. దీంతో న్యూజిలాండ్ జట్టును భారత్ ను అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ భారత్ లోకి ప్రవేశించిన తర్వాత న్యూజిలాండ్ తను అసలు సిసలైన ఆటతీరును చూపించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఈ సిరీస్లో సాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. న్యూజిలాండ్ 3 టెస్టులు గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. తద్వారా న్యూజిలాండ్ జట్టు తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ పై 3-0 తేడాతో విజయం సాధించింది.. .
ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్నాడు
సాంట్నర్ ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి (ఈ కథనం రాసే సమయానికి) న్యూజిలాండ్ జట్టు సెమీ ఫైనల్ వెళ్లడానికి తన వంతు కృషి చేశాడు. ఒకానొక దశలో బవుమా(56), వాన్ డెర్ డసెన్ (69) రెండో వికెట్ కు 105 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో.. సాంట్నర్ అద్భుతమైన బంతులు వేసి ఆకట్టుకున్నాడు. 36 పరుగుల వ్యవధిలోనే ఇద్దరినీ అవుట్ చేసి మ్యాచ్ ఒక్కసారిగా న్యూజిలాండ్ వైపు మరలే విధంగా చేశాడు. మరోవైపు ప్రమాదకరమైన క్లాసెన్(3) ను కూడా బోల్తా కొట్టించి.. దక్షిణాఫ్రికాకు కోలుకోలేని షాకిచ్చాడు. దక్షిణాఫ్రికా జట్టుకు సంబంధించి మూడు కీలక వికెట్లను తీసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో సాంట్నర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఖచ్చితమైన కొలతలతో
సాధారణంగా పేరు మోసిన చెఫ్ ఖచ్చితమైన కొలతలతో వంటకాలను వండుతాడు. అలాగే సాంట్నర్ ఖచ్చితమైన కొలతలతోనే బంతులు వేస్తాడు. ప్రత్యర్థి బాటర్ లను ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. అందువల్లే అతడికి ఇంద్రజాలికుడు అనే బిరుదు వచ్చింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు సాంట్నర్ ను మిస్టరీ మ్యాన్ అని పిలుస్తుంటారు. స్పిన్ కు సహకరించని మైదానాలపై కూడా బౌన్స్ రాబట్టడంలో సాంట్నర్ సిద్ధ హస్తుడు. అందువల్లే న్యూజిలాండ్ జట్టు వరుసగా విజయాలు సాధిస్తోంది. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క టీమిండియా తప్ప మిగతా జట్లు ఏవీ న్యూజిలాండ్ ను ఓడించలేదు.
Also Read : మీ మొహాలు మండ.. ప్రత్యర్థులపై గెలవలేరు గాని.. భారత్ పై అడ్వాంటేజ్ గోల ఏందిరా బాబూ..
CAPTAIN MITCHELL SANTNER.
– A spell of 3/43 while defending 362 Vs South Africa in the Semi Final. The skipper led from the front in the knockout match, what a bowler. pic.twitter.com/qLbXgWWeSZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2025